Home » ప్లీజ్..మా ఆయ‌న‌ను అలా అన‌కండి…ప‌ల్స‌ర్ బైక్ జాన్సీ రిక్వెస్ట్..!

ప్లీజ్..మా ఆయ‌న‌ను అలా అన‌కండి…ప‌ల్స‌ర్ బైక్ జాన్సీ రిక్వెస్ట్..!

by AJAY
Ad

శ్రీదేవి డ్రామా కంపెనీలో ప‌ల్స‌ర్ బైక్ పాట‌పై స్టెప్పులు వేసి నెట్టింట వైర‌ల్ గా మారిన డ్యాన్స‌ర్ జాన్సీకి చాలా మంది అభిమానులు అయ్యారు. జాన్సీ నిజానికి ఏపీ ఆర్టీసీలో కండ‌క్ట‌ర్ గా ఉద్యోగం చేస్తోంది. ఇక త‌న టాలెంట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసే అవ‌కాశాన్ని అందుకుంది. ప‌ల్స‌ర్ బైక్ పాట‌కు దుమ్ము లేపేయ‌డంతో ఇప్పుడు స్టార్ గా మారిపోయింది.

Advertisement

వ‌రుస‌గా ప‌లు యూట్యూబ్ ఛాన‌ల్స్ కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటోంది. కండ‌క్ట‌ర్ గా ఉద్యోగం చేస్తున్న జాన్సీ లోని టాలెంట్ చూసి చాలా మంది ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ప్ర‌శంసించేవాళ్లు ఉన్న‌ట్టే విమర్శించేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. కొంత‌మంది జాన్సీతో పాటూ ఆమె భ‌ర్త‌పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో ఆ ట్రోల్స్ మ‌రియు విమ‌ర్శ‌లపై జాన్సీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించింది.

Advertisement

మంచి ఛాన్స్ వ‌చ్చింద‌ని నాలోని టాలెంట్ ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఆ షోకు వెళ్లాను. చాలా మంది నా డ్యాన్స్ ను మెచ్చుకుని నన్ను పొగుడుతున్నారు కానీ కొంత‌మంది మాత్రం కావాల‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నార‌ని చెప్పింది. నాలోని టాలెంట్ చూసి మా ఆయ‌న ఎంక‌రేజ్ చేస్తున్నారు. దాన్ని మీరు నాశ‌ణం చేయ‌కండి ద‌య‌చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్ట‌కండి.

మా ఆయ‌న‌ను ట్రోల్ చేయ‌డం మానేయండి అంటూ జాన్సీ రిక్వెస్ట్ చేసింది. ఇక పై ఇలా చేయ‌రని ఆశిస్తున్నా ద‌య‌చేసి మా ఆయ‌న‌ను ట్రోల్ చేయ‌కండి అంటూ జాన్సీ కోరింది. ఇక జాన్సీ ఆవేద‌న చూసిన నెటిజ‌న్లు అలాంటి వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని వాళ్లు కొంత‌మంది ఎదుగుతుంటే చూడ‌లేర‌ని కిందకి లాగేస్తార‌ని కామెంట్స్ పెడుతూ జాన్సీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

Visitors Are Also Reading