ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరోటి లేదు. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్న మన ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మనం ఏం చేయలేం. మారిన జీవిన విధానంతో చాలా మంది రోగాలను కొని తెచ్చుకుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువ మంది బయటి ఆహారానికి అలవాటు పడ్డారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ఇలా ఆయిల్ ఫుడ్ కి అంకితమవుతున్నారు. దీంతో లేనిపోని రోగాలను తెచ్చుకుంటున్నారు. బయటి ఆహాారానికి బదులు మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : మీకు తెలియని CINTHOL సబ్బు స్టోరీ! జర్మనీ యుద్దంతో లింక్!
Advertisement
Advertisement
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం మొలకెత్తిన గింజలను చాలా మంది తింటున్నారు. అదేవిధంగా వీటిని బయట కూడా అమ్ముతున్నారు. వీటితో ముఖం తాజాగా ఉండటంతో పాటు ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని, గోళ్లను సంరక్షిస్తాయి. మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
Also Read : మీ ఇంట్లో ఈ మొక్కలను అస్సలు పెంచకండి.. మీకు నష్టం పక్కా !
బరువు తగ్గాలనుకునే వారికి కూడా మొలకెత్తిన గింజలు చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే.. వీటిలో జీర్ణక్రియను పెంపొందించే ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విషపదార్థాలు తొలగించడంలో మొలకలు బాగా పని చేస్తాయి.అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యం బారి నుంచి రక్షిస్తుంది.
Also Read : అంబానీ కోడలు మెడలోని నెక్లెస్ ఖరీదు. అక్షరాల 500 కోట్లు! ఇంతకీ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటీ !