Home » AKANDA : బావా.. ‘అఖండ’ గా దుమ్ములేపావ్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

AKANDA : బావా.. ‘అఖండ’ గా దుమ్ములేపావ్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

by Bunty

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రెండవ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో… రెండు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ హిట్ కాంబినేషన్ లో హైట్రిక్ విజయం సాధించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా పై నారా చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇతర ప్రముఖులు కూడా స్పందించారు.

ఈ నేపథ్యంలోనే   దగ్గుబాటి వెంకటేశ్వర రావు అఖండ సినిమాపై రియాక్ట్ అవ్వడం నందమూరి కుటుంబ అభిమానులకు అలాగే బాలయ్య ఫాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆయన ఏ సినిమా పై ఇలా అధ్యక్షుడు కాకపోవడం గమనార్హం. ఇలాంటి వాటిపై సోషల్ మీడియా లో అంత ఘాటుగా ఉండే వ్యక్తి కూడా కాదు. అందుకే అఖండ పై దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన కామెంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య సినిమా ను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు. హిందుత్వం, హిందుత్వ వాదం గురించి అఖండ చిత్రంలో బాగా చెప్పారు అని వెల్లడించారు. గౌతమ పుత్ర శాతకర్ణి సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ నటనకు ఇదే పరాకాష్ట అనుకునేవాడిని అని గుర్తు చేశారు వెంకటేశ్వరరావు. కానీ అఖండ లో అంతకుమించిన.. కనబరచారని.. బాక్సాఫీస్ బొనంజా ప్రశంసలతో ముంచెత్తారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన కామెంట్ కు బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Visitors Are Also Reading