Home » ఠాగూర్ సినిమా విషయంలో నన్ను మోసం చేసారు…!

ఠాగూర్ సినిమా విషయంలో నన్ను మోసం చేసారు…!

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి మాస్ దర్శకుడు వి.వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఠాగూర్. అవినీతి నిర్ములన అనే కథతో వచ్చిన ఈ సినిమా అపట్లో సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్స్ గా జ్యోతిక, శ్రియ నటించారు. అలాగే ఇందులో తారాగణం కూడా భారీగానే ఉంటది. పెద్ద పెద్ద ఆర్టిస్టులో ఇందులో మనకు కనిపిస్తారు. అందులో ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు కూడా ఒక్కరు. కానీ ఆయన ఠాగూర్ సినిమా విషయంలో నన్ను మోసం చేసారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

Advertisement

అయితే మామూలుగానే లాయర్ అయిన సివిఎల్ నరసింహారావు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో లాయర్లు అంత సులువుగా మోసపోరు కదా.. మీరు ఎపుడైనా మోసపోయారు అని ప్రశ్నించగా.. నేను రెండు సందర్భాల్లో మోసపోయాను అని చెప్పారు. అవి ఏంటంటే… ఓసారి బైక్ అమ్మకం విషయంలో మోసపోయిన నేను ఠాగూర్ సినిమా విషయంలో కూడా మోసపోయాను అని చెప్పారు. ఎలా అని ప్రశ్నించగా… రక్ష అనే ఓ సంస్థను ఏర్పాటు చేసి 25 ఏళ్ళు అవుతుంది. ఇందులో ఓ రిటైర్డ్ డీజీపీతో యాంటీ కరెప్షన్ వింగ్ ను ఓ ఏడాది నడిపాం. ఇందులో ఎలాంటి అవినీతి ఉండకూడదు అనే ఉద్దేశంతో పనిచేసాము. ఠాగూర్ సినిమా కథకు ఇదే మూలం.

Advertisement

అయితే ఠాగూర్ సినిమా అనుకున్నప్పుడు ఇది కోసం ఓ సైట్ ను క్రియేట్ చేయాలనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తో కలిసి అనుకున్నం. ఆ సైట్ తో ప్రాణాలకు మేలు చేయాలనీ అనుకున్నం. ఠాగూర్ సినిమా కూడా దీని ఆధారంగానే తీసాం. కానీ సినిమా హిట్ అయ్యి విజయం అందుకున్న తర్వాత.. సైట్ గురించి అడిగితే.. సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఇంకా ప్రమోషన్స్ అవసరం లేదు దానిని పక్కన పెట్టారు అని నరసింహారావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కెప్టెన్ అయితే ఆర్సీబీ పని గోవిందా.. గోవిందా..?

జడేజాను వదిలేస్తే చెన్నైకి 16 కోట్ల లాభం..!

Visitors Are Also Reading