Telugu News » Blog » Custody Teaser : నిజాన్ని ‘కస్టడీ’ లోకి తీసుకున్న నాగచైతన్య

Custody Teaser : నిజాన్ని ‘కస్టడీ’ లోకి తీసుకున్న నాగచైతన్య

by Bunty
Ads

అక్కినేని నాగార్జున నటించిన సినిమా ఈమధ్య కాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అక్కినేని నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింఘ్ చద్దా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బాలీవుడ్ లో నటించిన గెస్ట్ పాత్రలో సక్సెస్ అందుకోలేకపోయాడు నాగచైతన్య.

Advertisement

READ ALSO : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?

ఇక ఈ నేపథ్యం లోనే మరో ప్రాజెక్టు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా కస్టడీ. ఈ సినిమాకు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యతో కృతి శెట్టి స్టెప్పులు వేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్లు వదిలిన చిత్ర బృందం… తాజాగా ఈ సినిమా టీజర్ ను వదిలింది. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Custody Teaser: Witness Rage Of Wounded Heart

‘ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది’ అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ‘బంగార్రాజు’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

READ ALSO : కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

Advertisement