Ads
ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి విచిత్రమైన ఘటనలను కొందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా ఉండవల్లిలో వ్యవసాయ విద్యుత్ మోటార్‌ను పరిశీలించేందుకు ఓ కరెంట్ అధికారి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఆఫీసర్‌కు వింత అనుభవమే ఎదురైంది. మీటర్ రీడింగ్ చూసేందుకు మీటర్ డోర్ ఓపెన్ చేయగా.. ఎప్పటి నుంచో అందులో ఉన్న త్రాచుపాము ఒక్కసారిగా అతనిపై దాడికి ప్రయత్నించింది. కానీ తృటిలో అతడు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ సమాచారం ఇవ్వడంతో స్పాట్‌కు చేరుకుని పామును పట్టుకుని అడవిలో వదిలేశారు.