ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్లు సామ్ కరణ్,బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికారు. టి20 వరల్డ్ కప్ లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన ఈ ఇద్దరి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సామ్ కరన్ అందుకున్నాడు.
Advertisement
రూ.18.50 కోట్ల రికార్డు ధరకు సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. సామ్ కరన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించడంతో ధర అమాంతం పెరిగింది. ఇక ఎంతైనా తగ్గేదేలే అని భావించిన పంజాబ్, రికార్డు ధరకు సామ్ కరన్ ను దక్కించుకుంది.ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకోవాలన్న ఫ్రాంచైజీల ఆశలపై నీళ్లు చల్లింది. చెన్నై సూపర్ కింగ్స్ టెస్టు జట్టు కెప్టెన్ కోసం నెలకొన్న తీవ్రమైన పోటీలో భారీ ధర వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
Advertisement
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏకంగా రూ. 16.25 కోట్ల రూపాయలకు స్ట్రోక్స్ ను కొనుగోలు చేసింది. కాగా ఈ స్టార్ ప్లేయర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జేయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే స్ట్రోక్స్ ను వదులుకోవడానికి ఇష్టపడని సీఎస్ కే అతని కోసం ఈ మేరకు భారీ మొత్తం ఖర్చు చేసింది. ఇక గతంలో చెన్నైకి ఆడిన స్టోక్స్ తిరిగి రావడం వెనుక తలా ధోని హస్తం ఉందనడంలో సందేహం లేదు. స్టోక్స్ రాకతో కొత్త కెప్టెన్ దొరికేసినట్లేనని అభిమానులు సంబరపడుతున్నారు. ధోని ఇక గుండె మీద చేయి వేసుకుని రిలాక్స్ అవ్వచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
READ ALSO : కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !