నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో సిరిసిల్లకు చెందిన ఆరవెల్లి అవనిష్ రావు ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.కేవలం 18 సంవత్సరాల వయసు ఉన్న హార్డ్ హిట్టర్ అవనిశ్ ని కనీస ధర అయిన 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేసినట్లు సమాచారం. అవనిష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందినవాడు.
దీంతో అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన ధోని నాయకత్వంలో రాటుదేలుతాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ జట్టు తరుపున ఆడిన అవినీష్ రావు విశేషంగా రాణించాడు. అలాగే వికెట్ కీపర్ గా కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.
Advertisement
వినో మాన్కడ్ ట్రోపి లో ఆరు ఇన్నింగ్స్ లో 274 పరుగులు చేయటం తో పాటు స్ట్రైక్ రేట్ 148.1 గా ఉంది. గత నెల నవంబర్లో నాలుగు జట్ల అండర్ 19 సిరీస్ లోను తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇండియా బి జట్టు జరిగిన మ్యాచ్లో 163 పరుగులను కేవలం 93 బంతుల్లోని చేశాడు. దాంతో జనవరి 19 వ తేదీన సౌత్ ఆఫ్రికా లో ప్రారంభం అయ్యే U 19 వరల్డ్ కప్ టీం లో చోటు సంపాదించాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.