Home » IPL 2023 : బాల్‌ కొనడానికి డబ్బుల్లేవ్‌.. కట్‌ చేస్తే ధోనీ టీంలోకి ఎంట్రీ..

IPL 2023 : బాల్‌ కొనడానికి డబ్బుల్లేవ్‌.. కట్‌ చేస్తే ధోనీ టీంలోకి ఎంట్రీ..

by Bunty
Ad

ఐపీఎల్ మినీ వేలం, అంటే కొంతమంది క్రికెటర్లను వదులుకోగా తమ వద్ద మిగిలిన సొమ్ము నుంచి తమ అవసరాల మేరకు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు లభించే అవకాశం. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2023 వేలంలో ఆల్ రౌండర్లకు కాసుల పంట పండింది. రెండో సెట్ లో ఆల్ రౌండర్లు వేళానికి రాగా, వారిని దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ఐపీఎల్ వేలంలో రికార్డులు బేక్ అయ్యాయి.

Advertisement

తమ దగ్గర పర్స్ తక్కువగా ఉన్నప్పటికీ కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్ లను దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వెనుకాడలేదు. ఇక ఈసారి వేలంలో సామ్ కరణ్ రూ. 18.50 కోట్లకు అమ్ముడుపోయి ఐపిఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు.అటు ఆంధ్ర యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్ర ప్రీమియర్ 2022లో అద్భుతంగా రాణించిన రషీద్ సీఎస్కే టాలెంట్ స్కౌట్ ల దృష్టిలో పడ్డాడు.

Advertisement

ఈ ఏడాది ఏపీఎల్ లో రాయలసీమ కింగ్స్ తరపున ఆడిన రషీద్ 159 పరుగులు సాధించాడు. అదేవిధంగా 2022 అండర్-19 ప్రపంచకప్ ను గెలుచుకున్న యువభారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రపంచ కప్ ముగిసిన అనంతరం జరిగిన ఐపిఎల్ 2022 మెగా వేలంలో రషీద్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు. కానీ కొన్ని కారణాలవల్ల రషీద్ తో పాటు పలువురు అండర్ 19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపిఎల్-2023 మినీ వేలంలో మాత్రం రషీద్ కల నెరవేరింది.

Read Also : ఏపీ వాసులకు జగన్ బర్త్ డే గిఫ్ట్.. రూ. 190కే 400 GB డేటా..!

Visitors Are Also Reading