Home » బాల్ ట్యాంపరింగ్‌తోనే 5 వికెట్లు తీశాడంటూ విమర్శలు.. బ్యాట్‌తో ఆసీస్ బెండు తీసిన జడేజా

బాల్ ట్యాంపరింగ్‌తోనే 5 వికెట్లు తీశాడంటూ విమర్శలు.. బ్యాట్‌తో ఆసీస్ బెండు తీసిన జడేజా

by Anji
Ad

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ రెండో రోజు ఆటముగిసే సరికి తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ 144 పరుగుల ఆధిక్యం సాధించింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ గరిష్టంగా 120 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవీంద్ర జడేజా (66), అక్షర్ పటేల్ (52) పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అజేయంగా నిలిచాడు. కంగారు జట్టు తరుపున ఆరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న టాడ్ మర్పి 5 వికెట్లు తీశాడు. మరోవైపు ఆరంగేట్ర మ్యాచ్ లో భరత్ 8 పరుగులు మాత్రమే చేసి.. టాడ్ మర్పి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీసారు. 

Advertisement

ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలుత బంతితోనూ  ఆ తరువాత బ్యాట్ తో సత్తా చాటి, విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. కపిల్ దేవ్ ని వెనక్కి నెట్టడమే కాకుండా.. తన పేరుతో మరెన్నో రికార్డులను నెలకొల్పాడు. నాగపూర్ లో బంతితో విధ్వంసం సృష్టించిన రవీంద్ర జడేజా బ్యాట్ తోనూ అద్భుతాలు చేసాడు. తొలి ఇన్నింగ్స్ తో జడేజా తొలి ఐదు వికెట్లను తీశాడు. ఆ తరువాత అతని బ్యాట్ నుంచి హాప్ సెంచరీ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Advertisement

Also Read :  కోహ్లీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా ?

Manam News

భారత్ తరుపున ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక అర్థసెంచరీలు, 5 వికెట్లు సాధించిన ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ ఘనత జడేజా నాలుగోసారి సాధించాడు. మాజీ కెప్టెన్, వెటరన్ ఆల రౌండర్ కపిల్ దేవ్ రికార్డును సైతం జడేజా బ్రేక్ చేశాడు. ఈ ఫీట్ ని కపిల్ నాలుగు సార్లు చేయగా.. ప్రస్తుతం జడేజా కపిల్ కన్నా ముందున్నాడు. మరోవైపు తొలిరోజు ఆటలో జడేజాను బాల్ టాంపరింగ్ చేశాడు అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జడేజా తన వేలికి పెయిన్ కిల్లర్ క్రీమ్ రాసుకోవడం కనిపించింది. ఆ తరువాత ఆస్ట్రేలియన్ మీడియా టాంపరింగ్ చేశాడంటూ.. జడేజా పై విమర్శలు చేసింది. మ్యాచ్ రిఫరీ భారత ఆల్ రౌండర్ కి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ వివాదానికి తెర పడింది.  

Also Read :  Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో రిలీజ్… వైరల్

Visitors Are Also Reading