పుష్ప సినిమా గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. సినిమా విడుదల అయినప్పుడు కాస్త నెగిటివ్ టాక్‌తో కలెక్షన్‌లు మొదలైన.. మెల్లమెల్లగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇతర భాషల్లో నటీనటులు మాత్రమే కాదు.. క్రికెటర్లు కూడా పుష్ప సినిమా మీద ప్రత్యేకంగా ఫోకస్ వచ్చే విధంగా చేశారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉందని ఫిల్మ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: పుష్ప లో మరో కాపీ దొరికేసింది గా..! అల్లుఅర్జున్ మ్యానరిజమ్స్ కి ఇన్స్పిరేషన్ ఇదే ?
Advertisement
ప్రస్తుతం ఏ దేశ క్రికెట్ ఆటగాడిని చూసినా పుష్ప సినిమాలోని పాటనో, లేదా సీన్ నో అల్లు అర్జున్ మ్యానరిజంనో ఇమిటేట్ చేస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ తగ్గేదే లే అని చెప్పే డైలాగ్ క్రికెట్ వరల్డ్‌లో కూడా మారు మ్రోగిపోతుంది. మరీ క్రికెటర్స్ అందరికీ పుష్ప పై ఎందుకు ఇంత క్రేజ్ అనే దానికి ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి.
Advertisement
ముందుగా డేవిడ్ వార్నర్ ఎప్పటి మాదిరిగానే పుష్ప సినిమాలో పాటను ఫేస్ యాప్‌తో ఎడిట్ చేసి ఈ చిత్రానికి తన ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆ తరువాత పలువురు క్రికెటర్లు రీల్స్ చేస్తూ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ క్రికెటర్లందరూ పుష్ప చిత్రం థియేటర్లలో ఉన్నప్పుటి కంటే ఓటీటీలో విడుదలైన తరువాత ఎక్కువగా దీనిపై వీడియోలు చేయడం మొదలు పెట్టారు.
థియేటర్లలో విడుదలైన నెల రోజుల తరువాత పుష్ప అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవ్వడం మొదలైంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తరువాత క్రికెటర్లందరూ దీనిపై మరింత ఫోకస్ పెట్టారు. అయితే ఇవన్నీ వారు కావాలని చేసినవి కావని, ప్రైమ్ ప్లాన్ చేసిన పెయిడ్ ప్రమోషన్‌లలో ఇదంతా భాగం అని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఈ క్రికెటర్లతో ప్రమోషన్‌లతో చేయించడానికి కూడా ప్రైమ్ చాలానే ఖర్చు చేసినట్టు సమాచారం.
Also Read: ఆడేసుకుంటున్న నెటిజన్స్ చూసుకోవాలిగా సుకుమార్ గారు అంటూ ట్రోలింగ్ .!