Home » ఇండియన్ 2 లో క్రికెటర్ యువ‌రాజ్ తండ్రి..!

ఇండియన్ 2 లో క్రికెటర్ యువ‌రాజ్ తండ్రి..!

by Anji
Ad

శంకర్ కమల్ హాసన్ కాంబోకు తిరుగులేదు. గతంలో వీరి కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సినిమా వచ్చి 21 ఏళ్లు అవుతున్న ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. కాగా ఇప్పుడు ‘ఇండియన్-2’ తెరకెక్కడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియంట్ మూవీస్ బ్యానర్ లపై ఏ.సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read :  సినిమాల్లోకి అల్లు అర్జున్ సతీమణి…ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్…?

Advertisement

Manam

Advertisement

అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ తండ్రి ఓ కీలకపాత్రలో పోషిస్తున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యోగ్ రాజ్ సింగ్ వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ లో తనకు మేకప్ వేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ కెమెరా వెనుక పనిచేసే అందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్ గా తయారు చేస్తున్న మేకప్ మెన్ కు ధన్యవాదాలు. కమల్ హాసన్ తో ఇండియన్-2 లో నటించడానికి పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు.

Manam

Also Read : జయసుధ పెళ్లిలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా.. మొదటి భర్త ఆయనేనా..?

 

Visitors Are Also Reading