Home » క్రికెటర్ కే.ఎల్. రాహుల్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

క్రికెటర్ కే.ఎల్. రాహుల్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

by Anji
Ad

టీమిండియా స్టార్ క్రికెటర్ కే.ఎల్. రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన ఆటతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో హాప్ సెంచరీ సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు కే.ఎల్. రాహుల్. ఇన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి తాను ఇష్టపడిన అమ్మాయిని మరో పది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నాడు. టీమిండియా ప్లేయర్ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి మరెవ్వరో కాదండోయ్.. ఓ స్టార్ కూతురు, ప్రస్తుతం నటి కూడా. ఆమె అతియాశెట్టి. వీరిద్దరూ ఎప్పుడో ఒకటవుతారనుకున్నప్పటికీ ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నారు. కే.ఎల్. రాహుల్-అతియాశెట్టిల పెళ్లి జనవరి 23, 2023న జరుగనుంది. 

Advertisement

కే.ఎల్. రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె. వీరిద్దరూ చాలా రోజుల నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. పెళ్లి వేడుకలు జనవరి 21న నుంచే ప్రారంభం కానున్నాయి.  కే.ఎల్. రాహుల్ కుటుంబ సభ్యులు, సునీల్ శెట్టి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పెళ్లి పనుల ఏర్పాట్లలో చాలా బిజీగానే ఉన్నారట. రాహుల్-అతియాశెట్టి తమ సోషల్ మీడియా హ్యాండిల్ లో వీరు కలిసి దిగిన ఫోటోలను నిత్యం షేర్ చేస్తూనే ఉన్నారు. వీరి పెళ్లితో మరో బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీతో మరో క్రికెటర్ బంధుత్వం కలవబోతుందనే వార్తతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటాడు. 

Advertisement

Also Read :  సరికొత్త రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్.. తొలి భారత బౌలర్ గా..!

ముంబై ఖండాలాలోని సునీల్ శెట్టి ఇంట్లోనే ఈ పెళ్లి వేడుకలు జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ స్టార్ కపుల్ వెడ్డింగ్ కోసం బాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు క్రీడారంగానికి చెందిన వారిలో ఎవరినీ ఆహ్వానించాలనే విషయంపై ఓ లిస్ట్ కూడా తయారు అయిందని సమాచారం. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్ ని ఆహ్వానిస్తున్నారట. క్రీడా రంగం నుంచి మాజీ టీమిండియా కెప్టెన్లు ఎం.ఎస్. ధోని, విరాట్ కోహ్లీ తో పాటు రాహుల్ ఫ్రెండ్స్ కొందరూ వివాహ వేడుకకు హాజరు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి వరకు రాహుల్ ఎవరెవరినీ ఆహ్వానిస్తారో వేచి చూడాలి. 

Also Read :  ఈనెల 18న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ లో మ్యాచ్.. ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. వివరాలు ఇవే

Visitors Are Also Reading