ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది మనదేశంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగు రోజుల కిందట వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసింది ఐసీసీ. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ…అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది అన్నమాట. దాదాపు 40 రోజులకు పైగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్ లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే జరగనున్నాయి.
Advertisement
అయితే తాజాగా… ఐసీసీ చేసిన భారీ తప్పిదం తెరపైకి వచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ రిలీజ్ చేయడంలో టీమిండియా కు ఐసీసీ అన్యాయం చేసిందని చర్చ జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ షెడ్యూల్లో భాగంగా… టీమిండియా ఏకంగా తొమ్మిది మ్యాచులు ఆడనుంది. ఇదంతా బాగానే ఉంది. టీమిండియా ఆడే… 9 మ్యాచులు తొమ్మిది వివిధ వేదికలలో ఆడనుంది. అంటే గ్యాప్ లేకుండా టీమిండియా 9 ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే… ఈ లీగ్ దశలో ఆడే మ్యాచ్ల కోసం టీమిండియా ఏకంగా 8500 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
ఇలా సుదూరంగా ప్రయాణం చేయడం కారణంగా… మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేసే సమయం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రాంతాలు మారినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులు టీమిండియా కు ప్రతికూలంగా మారిపోతాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం మరియు చలికాలం కాబట్టి టీమిండియా ప్లేయర్లకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఐసీసీపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వదేశంలో మ్యాచులు పెట్టుకొని… టీమిండియాను తొమ్మిది ప్రాంతాలకు తిప్పడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!