Home » హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్డేట్….ఆ ఒక్క సీన్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు థియేట‌ర్లో గూస్ బంప్స్ ప‌క్కా….!

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్డేట్….ఆ ఒక్క సీన్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు థియేట‌ర్లో గూస్ బంప్స్ ప‌క్కా….!

by AJAY
Ad

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వైపు సినిమాల‌ను మ‌రోవైపు రాజ‌కీయాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. రాజ‌కీయాల్లో చురుకుగా ఉంటూనే చ‌క‌చ‌కా సినిమాలు పూర్తి చేసి విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచింది. ఇక పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌కత్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అనే సినిమాలో న‌టిస్తున్నారు.

Pawan kalyan

Pawan kalyan

ఈ సినిమాలో ప‌వ‌న్ మొద‌టి సారి డిఫ‌రెంట్ లుక్ తో క‌నిపిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. సోషియో ఫాంట‌సీచిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement

Advertisement

తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విషయం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేసే ఓ సీన్ ఉండ‌బోతుంది. దానికోసం ఓ భారీ సెట్ ను నిర్మించిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే సినిమాలో వంద‌ల మంది బాడీబిల్డర్ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైట్ సీన్ ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సీన్ గ‌న‌క సినిమాలో నిజంగానే ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ప‌క్కా అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading