Home » బిగ్ బాస్ బూతుల స్వ‌ర్గం…వింత జంతువులు వ‌చ్చేశాయంటూ సీపీఐ నారాయణ ఫైర్..!

బిగ్ బాస్ బూతుల స్వ‌ర్గం…వింత జంతువులు వ‌చ్చేశాయంటూ సీపీఐ నారాయణ ఫైర్..!

by AJAY
Ad

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ అంటే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అని చెప్పాలి. పెద్ద‌వాళ్ల నుండి చిన్న పిల్ల‌ల వ‌ర‌కూ అంద‌రూ బిగ్ బాస్ ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మొద‌ట హిందీలో బిగ్ బాస్ స‌క్సెస్ అవ్వ‌గా ఆ త‌ర‌వాత అన్ని బాష‌ల్లోనూ ఈ షోను ప్రారంభించారు. ఇక తెలుగులో స‌క్సెస్ ఫుల్ గా ఐదు సీజ‌న్ ల‌ను పూర్తి చేసుకుంది. అయితే ఓటీటీ సీజ‌న్ అంత‌గా స‌క్సెస్ అవ్వ‌క‌పోవడంతో మ‌ళ్లీ టీవీ ద్వారానే సీజ‌న్ 6ను నాగార్జున హోస్ట్ గా ప్రారంభించారు.

Advertisement

ఈ సీజ‌న్ లో 20 మంది కంటెస్టెంట్ లు హౌజ్ లోకి అడుగుపెడుతున్నారు. వంద రోజుల పాటూ బిగ్ బాస్ 6 ప్ర‌సారం కానుంది. ఇక బిగ్ బాస్ ను ఇష్ట‌ప‌డేవారితో పాటూ బిగ్ బాస్ అంటే అస్స‌లు గిట్ట‌నివాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా సీపీఐ నేత నారాయ‌ణ బిగ్ అంటేనే మండిపోతూ ఉంటారు. గ‌తంలో సీపీఐ నారాయ‌ణ బిగ్ బాస్ పై ప‌లుమార్లు సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు.

Advertisement

బిగ్ బాస్ ఒక బ్రోత‌ల్ హౌస్ అంటూ మండి ప‌డ్డారు. ఇక తాజాగా మ‌రోసారి బిగ్ బాస్ పై నారాయ‌ణ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కాసుల‌కు క‌క్కుర్తిప‌డేవాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి షోలు వ‌స్తూనే ఉంటాయ‌ని నాగార్జున‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు.

nagarjuna ap tickets issue

అస‌లు బిగ్ బాస్ షోతో ఎలాంటి సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్ర‌శ్నించాల‌ని అన్నారు. బిగ్ బాస్ షోను బూతుల స్వ‌ర్గం గా మారుస్తారా అంటూ కామెంట్ చేశారు. అదొక అనైతిక షో వింత జంతువులు ఇందులోకి వ‌చ్చాయి అంటూ త‌న స్టైల్ లో ఫైర్ అయ్యారు. ఇక సీపీఐ నారాయ‌ణ చేసిన కామెంట్స్ మ‌రోసారి వైర‌ల్ గా మారాయి.

Visitors Are Also Reading