Home » ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు..అలా చేస్తే రూ.1000 జ‌రిమానా.!

ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు..అలా చేస్తే రూ.1000 జ‌రిమానా.!

by AJAY
Ad

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌లో 50శాతం సీటింగ్ ప‌రిమితులు విధించారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. మాల్స్ పై కూడా ఆంక్షలు విధించారు. అదే దారిలో హర్యానా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. సినిమా థియేటర్లు మూసివేయాల‌ని నిర్ణయం తీసుకుంది. ఇక‌ తెలంగాణలోనూ క‌రోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ‌ ప్రభుత్వం అలర్ట్ అయింది.

covid rules telangana

covid rules telangana

 

తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిఆర్కే భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మతపరమైన, రాజకీయ సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలతో సహా ర్యాలీలు బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్ ల‌ నిర్వహణలో మ‌రియు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ‌ల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలని తెలిపారు.

Advertisement

Advertisement

also read : బాల‌య్య గోపించంద్ సినిమా నుండి డైలాగ్ లీక్…అక్క‌డ ఉంది సింహం అంటూ..!

ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో తరచూ శుభ్రం చేయాలని పేర్కొన్నారు. మాస్క్ లు, శానిటైజ‌ర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించాల‌ని విద్యాసంస్థల ఆవ‌ర‌ణ‌లో ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని తెలిపారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ లు ధ‌రించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించే రూల్ ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాని చెప్పారు. సీనియ‌ర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Visitors Are Also Reading