Home » తెలంగాణలో కొలువుల జాతర.. 10వ తరగతిపాసైన వారికి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణలో కొలువుల జాతర.. 10వ తరగతిపాసైన వారికి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..

by Bunty

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై దృష్టి సారించింది. నిరుద్యోగుల ఓట్లను రాబట్టేందుకు… వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.  ఇక తాజాగా  తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ మినిస్టిరియల్ సర్వీసు కింద వివిధ జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 163 ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషలో నైపుణ్యం, సంబంధిత స్కిల్స్ ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. ఓసి, బీసీ కేటగిరి అభ్యర్థులకు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

read also : BCCI సంచలన నిర్ణయం..IPL విదేశీ ప్లేయర్లకు ఎదురుదెబ్బ !

Visitors Are Also Reading