Home » వివాహం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా ?

వివాహం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ad

ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులోనే జ‌ర‌గాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. వాళ్లు ఈ సామెత చెప్పింది పెళ్లి విష‌యంలోనే. ఒక‌ప్పుడు పెళ్లిళ్లు చిన్న‌వ‌య‌సులో జరిగేవి. అలా జ‌ర‌గ‌టం కూడా మంచిది కాదు. ఆ త‌ర‌వాత స‌రైన వ‌య‌సులో పెళ్లిళ్లు చేయ‌డం మొద‌లైంది. కానీ ఇప్పుడు పెళ్లి వ‌య‌సు దాటిన త‌ర‌వాత చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు.

Advertisement

ఉద్యోగం కోసమనో జీవితంలో సెటిల్ అవ్వాల‌నో ఇలా పెళ్లిళ్లు ఆల‌స్యం అవుతున్నాయి. కానీ అలా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. ప్ర‌స్తుతం పురుషులకు 30 ఏళ్లు స్త్రీల‌కు 25 ఏళ్లు దాటిన త‌ర‌వాతే పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ అలా లేటు వ‌య‌సులో పెళ్లిళ్లు చేసుకుంటే శృంగా* సామ‌ర్థ్యం త‌గ్గ‌టం వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు కూడా త‌గ్గే స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ట‌.

Advertisement

లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకుంటే శృంగా* పై ఆస‌క్తి త‌గ్గిపోయే ప్ర‌మాదం కూడా ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక మ‌గ‌వాళ్లు అయితే 22 నుండి 26 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే మంచిద‌ట‌. ఆ వ‌య‌సులో శృంగా* సామ‌ర్థ్యం ఎక్కువ ఉండ‌టం తో పాటూ మొద‌డు కూడా చాలా చురుగ్గా ప‌నిచేస్తుంద‌ట‌.

ఆ వ‌య‌సులో పెళ్లి చేసుకున్న‌వాళ్లు సంసార జీవితాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించ‌డానికి అవకాశం ఉంటుంద‌ట‌. స్త్రీల విష‌యానికి వ‌స్తే 18 నుండి 22 ఏళ్ల మ‌ధ్య‌లోనే వివాహం జరిగితే మంచిద‌ట‌. ఆ వ‌య‌సులో స్త్రీలు చాలా ఆరోగ్యంగా ఉండ‌టం వ‌ల్ల పిల్ల‌ల‌ను క‌న‌డం కూడా సులువు అవుతుంద‌ట‌.

Visitors Are Also Reading