Telugu News » Blog » బుల్లి తెర‌పై క‌రోనా విజృంభ‌ణ‌… బిగ్ బాస్ స‌రయు, కౌశ‌ల్ ల‌కు కరోనా పాజిటివ్..!

బుల్లి తెర‌పై క‌రోనా విజృంభ‌ణ‌… బిగ్ బాస్ స‌రయు, కౌశ‌ల్ ల‌కు కరోనా పాజిటివ్..!

by AJAY
Ads

క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా బిగ్ బాస్ స‌ర‌యు మ‌ర‌యు బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ కౌశ‌ల్ మండ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని వారు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందని అన్ని జాగ్ర‌త్తలు తీసుకున్న‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చింద‌ని కౌశల్ తెలిపాడు.

Ads

sarayu koushal

త‌న‌ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాల‌ని కోరాడు. అంతే కాకుండా ఇలాంటి స‌మ‌యంలో షూటింగ్ లు, ఈవెంట్ లు జ‌ర‌ప‌కూడ‌ద‌ని కౌష‌ల్ కోరారు. సెల్ఫీలు కూడా ఇవ్వ‌డ‌కూద‌ని అన్నారు. ఇక స‌ర‌యు కూడా సోష‌ల్ మీడియా ద్వారా పాజిటివ్ వ‌చ్చిన విష‌యాన్ని తెలిపింది. త‌న‌ను క‌లిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాల‌ని కోరింది.

Ads

ANI MASTER

ప్ర‌స్తుతం తాను క్వారంటైన్ లో ఉన్నాన‌ని తెలిపింది. ఇదిలా ఉంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అంతా సంక్రాంతికి జ‌రిగిన ఈవెంట్ ల‌లో సందడి చేశారు. కాగా ఇప్ప‌టికే అని మాస్టార్ కు క‌రోనా వ‌చ్చి ఆవిడ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఈవెంట్ కు వెళ్లిన కౌశ‌ల్ మరియు స‌ర‌యు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు.

Ad

also read : BIGG BOSS OTT : బిగ్ బాస్ ఓటిటిలోకి ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్..భార్య‌తో స‌హా ఎంట్రీ…!

అయితే బిగ్ బాస్ విన్నర్ కౌశ‌ల్ మాటలు చూస్తుంటే టీవీ షోలు నిర్వ‌హిస్తున్న ఈవెంట్ లే కొంప ముంచుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ఈవెంట్ ల‌కు ఎక్కువ మంది సెల‌బ్రెటీలు హాజ‌ర‌వ్వ‌డం క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే కేసులు పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది.