Home » గుడ్ న్యూస్….క్రిస్మస్ లోపు కరోనా టాబ్లెట్…!

గుడ్ న్యూస్….క్రిస్మస్ లోపు కరోనా టాబ్లెట్…!

by AJAY
Ad

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన సమస్య ఏదైనా ఉంది అంటే డౌట్ లేకుండా అది కరోనా నే అని చెప్పొచ్చు. ఈ మహమ్మారి చైనాలో పురుపోసుకుని ప్రపంచదేశాలను వణికిస్తోంది. మహమ్మారి ఎంట్రీ ఇచ్చి ఏడాది కంటే ఎక్కువ సమయం గడిచినా ఇప్పటికీ రకరకాల వేరియంట్ ల రూపంలో వచ్చి కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను కరోనా పొట్టన పెట్టుకుంది. మరోవైపు ఇప్పుడు ఒమీక్రాన్ రూపంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కరోనా కు ముందు నుండి సరైన మందులు లేవన్న సంగతి తెలిసిందే.

Corona tablet

Corona tablet

కరోనా చికిత్స లో ఉపయోగిస్తున్న మందులు అన్నీ ఇతర జ్వరం మరియు వైరల్ ఫీవర్ లకు వాడేవే….కరోనా కు సరైన మందు లేకపోవడం వల్లనే ఎక్కువ మొత్తం లో మరణాలు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు కరోనా విషయం లో ఒక గుడ్ చెప్పింది యూకే దేశం. ఈ ఏడాది క్రిస్మస్ లోపలే కరోనా మాత్రని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. అమెరికా పరిశోధన సంస్థ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్ను పిరవిర్ ను అభివృద్ధి చేస్తోంది.

Advertisement

Advertisement

ఈ విషయాన్ని యుకే మీడియా వెల్లడించింది. క్రిస్మస్ లోగానే ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ టాబ్లెట్ వినియోగానికి అనుమతులు వచ్చాయి. స్వల్ప మరియు తీవ్ర స్థాయి లక్షణాలు ఉన్నవారికి ఈ మాత్ర ఇచ్చేందుకు నవంబర్ లోనే యూకే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వైరల్ రెప్లికేట్ అయ్యే సామర్థ్యాన్ని ఈ మాత్ర తగ్గిస్తుంది అని పేర్కొంది. కరోనా సోకిన వెంటనే తీసుకుంటే ఈ టాబ్లెట్ ప్రభావ వంతంగా పనిచేస్తుందని చెబుతోంది.

Visitors Are Also Reading