Home » వార్నీ…అఖిల్ “ఏజెంట్” లుక్ ను ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారా..?

వార్నీ…అఖిల్ “ఏజెంట్” లుక్ ను ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారా..?

by AJAY
Ad

అక్కినేని న‌టవార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్. ఊహ తెలియ‌ని వ‌య‌సులోనే అఖిల్ సిసింద్రీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి త‌న క్యూట్నెస్ తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక అక్కినేని కుటుంబం మొత్తం క‌లిసి నటించిన‌ మ‌నం సినిమా లో గెస్ట్ రోల్ లో క‌నిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో అఖిల్ లుక్ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేయడంతో హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని అక్కినేని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో వెయిట్ చేశారు.

Advertisement

దాంతో భారీ అంచ‌నాల న‌డుమ త‌న పేరునే టైటిల్ గా అఖిల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకు వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ తో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ క‌థ వీక్ గా ఉండ‌టం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ త‌ర‌వాత హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలతో ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ వీటిలో ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా మాత్రమే యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

దాంతో అఖిల్ ఇండ‌స్ట్రీలో హీరోగా నిల‌దొక్కుకునేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. గ్యాప్ లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక ప్ర‌స్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా లుక్ ను రిలీజ్ చేయ‌గా అఖిల్ గ‌తంలో మాదిరి కాకుండా స‌రికొత్త లుక్ లో కండ‌లు క‌లిగిన దేహంతో క‌నిపిస్తున్నాడు.

పొడ‌వాటి జుట్టు 8 ప్యాక్ బాడీతో క‌నిపించ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇదిలా ఉంటే ఈ లుక్ ను హాలీవుడ్ సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని జోన్ స్నో నుండి కాపీ కొట్టార‌ని ట్రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా హీరో మంచు కొండ‌ల్లో అచ్చం ఏజెంట్ పోస్టర్ లో మాదిరిగా నే క‌నిపించ‌డంతో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ALSO REAd :

సినిమాల్లో నటించమన్నపుడు మహేష్ బాబు ఏం చేసాడో తెలుసా..?

Visitors Are Also Reading