Home » ఆసక్తికరంగా మునుగోడు ఎన్నికల సర్వేలు ! విజయ అవకాశాలు ఈ పార్టీ కేనా ?

ఆసక్తికరంగా మునుగోడు ఎన్నికల సర్వేలు ! విజయ అవకాశాలు ఈ పార్టీ కేనా ?

by Anji
Ad

మునుగోడు నియోజకవర్గం లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గం గురించే మాట్లాడుకోవడం విశేషం. ఎక్కడ చూసినా ఎవరి నోటా అయినా మునుగోడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే మాట వినబడుతోంది. కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి పోయిన రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా కొన సాగు తోంది. కొంతమంది గెలుస్తారు అంటుంటే మరి కొంత మంది ఓడిపోతారని చెప్పడం విశేషం. మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారిగా COPACT సర్వే ఎం చెబుతుందో,  ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

Advertisement

 

1. చండూరు :

మున్సిపాలిటీ ఓట్లు-9950 రూరల్ ఓట్లు- 19500. కాస్త రాజకీయ చైతన్యం, ఐక్యూ లెవెల్స్ ఎక్కువగానే ఉండే చండూరు మండలంలో టిఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగానే ఉంది. ఎన్నిక ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయి, టిఆర్ఎస్ బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఈ మండలంలో డబ్బు పంపిణీ ప్రభావం ఉన్నప్పటికీ, ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకుంటున్న ప్రజలు ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకును టిఆర్ఎస్, బీజేపీలు సమానంగా షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ యువ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కనీసం ఐదు శాతం మేర బీజేపీ లాభపడే అవకాశం ఉంది. అలాగే ఈ మండలంలో బీఎస్పీకి కూడా కొన్ని ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఓట్లు చీల్చుకోవటానికి టీఆర్ఎస్ భారీగానే శ్రమిస్తున్నా, చండూరు మండలంలో మాత్రం ఓటర్లు బీజేపీ వైపే కాస్త మొగ్గు చూపుతున్నట్టు  సర్వేలో వెళ్లడైంది.

2. చౌటుప్పల్ :

మున్సిపాలిటీ ఓట్లు- 22,493 రూరల్- 37,500 ఈ ఎన్నికలో చాలా కీలకంగా భావించే చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులలో 25,493 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ఇక్కడ ప్రతి ఇంటిని టచ్ చేశాయి. ఈ మున్సిపాలిటీ మాత్రమే కాకుండా మండలం అంతా ఎన్నిక సమీపిస్తున్న కొద్ది, రెండు పార్టీలు కనీసం రెండుసార్లు మొత్తం చుట్టేశాయి. చౌటుప్పల్ లో మొదటి రెండు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు సమానంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో అక్కడి కాంగ్రెస్ ఓటు బ్యాంకును రెండు పార్టీలు సమానంగా పంచుకునేలా కనిపిస్తోంది. ఈ మండలంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోవడం చూస్తే రాహుల్ జోడో యాత్ర ప్రభావం మునుగోడు నియోజకవర్గం పై ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఈ మండలం హైదరాబాద్ కు ఆనుకుని ఉన్నప్పటికీ ఇటీవలి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఆడియో లీకుల ప్రభావం కూడా ఇక్కడ ఏమాత్రం లేదు. పైగా బయటినుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా మొహరించటం, టీఆర్ఎస్ లోకల్ క్యాడర్ కు నాన్ లోకల్ మధ్య గ్యాప్స్ పెంచినట్టు భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ మండలంలో ఈ అంశం టీఆర్ఎస్ కు తలనొప్పి గానే మారింది. అలాగే పోలీసులు భారీగా మోహరించటంతో ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. ఇవే పరిస్థితిలు కొనసాగుతుంటే చౌటుప్పల్ మండలంలో బీజేపీ కాస్త లాభపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మిగతా మండలాలతో పోలిస్తే ఇక్కడ డబ్బు, మద్యం ప్రభావం తక్కువేనని తెలుస్తోంది. పది రోజుల క్రితం బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు తంగేడుపల్లి, మరొకరు లింగోజిగూడెంకు చెందినవారు టీఆర్ఎస్ లో చేరటం బీజేపీకి కొద్దిగా మైనస్ అని చెప్పాలి.

Munugode bypoll

Munugode bypoll

3. గట్టుప్పల్ :
మొత్తం ఓటర్లు 16, 282  ఉన్నారు. ప్రధానంగా మూడు పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడ్డ మండలం కావడంతో ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అంటే కొద్దిగా మాత్రమే వెనుకబడింది. ఇక్కడ బీజేపీకి 50% ఓట్లు వస్తే, టీఆర్ఎస్ కు 45% , ఇతరులకు 5% వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ , బీజేపీలు పోటాపోటీగానే ఉన్న సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి మండలానికి , ఇంకా ముఖ్య గ్రామాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇన్ చార్జీలుగా కూర్చోవడంతో ఓటర్లు సైలెంట్ ఓటింగ్ తో తమ మనోభావాలను వ్యక్తపరిచే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ మండలంలో కాంగ్రెస్ నాయకత్వం సరిగ్గా లేకపోవడంతో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యేలా ఉంది. మిగతా రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఓట్లను సమానంగా చీల్చుకుంటాయి. ప్రజల మాటలను బట్టి ఇక్కడ డబ్బు చాలా ప్రధానంగా పనిచేయనున్నట్టు సమాచారం.

Advertisement

4. మర్రిగూడ :
మొత్తం ఓట్లు 27,800.  గతంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉన్న మండలం ఇది. ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ ముందు నుంచీ బలంగానే ఉన్నప్పటికీ , ప్రస్తుతం పరిస్థితి మారింది. రెండు పార్టీలు యువత టార్గెట్ గా పనిచేస్తున్నా , అధికార పార్టీ నుంచి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతిరోజు ఇంటింటికి చికెన్ , మటన్ సప్లై జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్ 5% లేదు. ఇక్కడ చివరి రెండు రోజుల్లో పరిస్థితులు తారుమారైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే ఈ మండలంలోని ఎస్సీ ఓట్లు కొంతవరకు బీఎస్పీకి పడే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్ ఇన్చార్జ్ గా ఉన్న లెంకలపల్లి లో ప్రతిరోజూ పండగే అన్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు , చర్లగూడెం, శివన్న గూడెం గ్రామాల ప్రజలకు అకౌంట్లో పడిన డబ్బులు ఫ్రీజ్ చేసి ఉంచారు. అవి ప్లీజ్ కాకపోతే ఇక్కడ టీఆర్ఎస్ కు మైనస్ కావచ్చు అని చెప్తున్నారు.

5. మునుగోడు :
మొత్తం ఓట్లు 36,000 ఓటర్లు.  మునుగోడు మండలంలో టీఆర్ఎస్ బీజేపీ రెండు సమాన అవకాశాలతో ఉన్నాయి. అయినా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటం ఆయనకు పర్సనల్ గా ఫ్యాన్స్ ఉండటం రాజగోపాల్ రెడ్డి కే లభించే అవకాశం ఉంది. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ పార్టీ నాయకత్వం సరిగ్గా లేకపోవడం , పార్టీలోనే తనకు జరిగిన అవమానంతో వెంకటరెడ్డి మౌనంగా ఉండటం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కమ్యూనిస్టు ప్రభావం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఇప్పటికే టీఆర్ఎస్ తో కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు టిఆర్ఎస్ కే పడ్డా, గతంలోని బీజేపీ ఓటు బ్యాంకు రాజగోపాల్ రెడ్డికి కలిసివస్తుంది. అలాగే రేపటి కేసిఆర్ సభ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్న మునుగోడు ఓటర్లు మాత్రం తమదైన శైలిలోనే ఓటు వేసే ఒక సాంప్రదాయం మొదటి నుంచి ఇక్కడ ఉంది. మొత్తానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఈ మండలంలో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు ఉన్న ఒక ఐదు శాతం మేర టీఆర్ఎస్ లాభపడే వాతావరణం కనిపిస్తుంది.

6. నాంపల్లి :

నాంపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 35000 మంది ఉన్నారు.  మండలంలో టిఆర్ఎస్ పై కాస్త వ్యతిరేకత ఉంది. టిఆర్ఎస్ బిజెపి నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను కూడా ఎవరు తీర్చుకుంటారనేది ప్రధాన అంశం. కాంగ్రెస్ అభిమానులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. నాంపల్లి మండలంలో త్రిముఖ పోరు జరగనుంది. కమ్యూనిస్టుల ఓట్లు కలవడంతో టిఆర్ఎస్ కే కొంచెం లాభం చేకూరే విధంగా ఉంది.

7. నారాయణపురం

నారాయణపురం లో మొత్తం ఓటర్ల సంఖ్య 36,069. కమ్యూనిస్టుల కంచుకోటగా నారాయణపురం మండలాన్ని పేర్కొంటారు. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కమ్యూనిస్టులే కావడం విశేషం. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ప్రభావం కూడా బాగానే ఉండడంతో టిఆర్ఎస్ కలిసి వస్తోంది . టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా నారాయణపురం మండలం కావడంతో ఈ మండలంలో టిఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభావం కూడా తండాల్లో కనిపిస్తోంది. చివరి నిమిషంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎవరికి మారితే వారికి ప్లస్ అవుతుంది. గుడి గుడి మల్కాపూర్ లో 26 మందికి దళిత బంధు రావడంతో పాటు వివిధ పథకాలు ఇక్కడ కొన్ని గ్రామాల్లో అమలు అవడంతో టిఆర్ఎస్కు కాస్త కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

 Munugode Assembly Bypoll in Telangana

Munugode Assembly Bypoll in Telangana

మునుగోడు నియోజకవర్గం మొత్తంలో బిజెపికి కాస్త మైనస్ ఉందనే చెప్పాలి. ఏపీకి పెద్దగా నెట్వర్క్ లేకపోవడం, అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బిజెపిలోకి రాకపోవడం మైనస్ అనే చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాకుండా చలమల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలిచేదనే కాకి కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల రాజగోపాల్ రెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత జరాలకు అవగాహన లేకపోవడంతో చేతి గుర్తుకే ఓటు వేయాలని మాట వినపడడం బిజెపికి కాస్త ఆందోళన కలిగించే అంశం. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,43, 594. మొత్తానికి చూస్తే తాజా పరిస్థితి ప్రకారం.. టీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 36 శాతం, కాంగ్రెస్ 14 శాతం ఇతర పార్టీలకు 9% ఓట్లు రావచ్చని తెలుస్తోంది.

 

Visitors Are Also Reading