వంట త్వరగా పూర్తి చేసుకోవాలంటే మహిళలకు ఉన్న పెద్ద వరం ప్రెజర్ కుక్కర్. వంట నుండి ఉడకబెట్టడం వరకు, దాదాపు అన్నింటిలో ప్రెజర్ కుక్కర్ ఉపయోగించబడుతుంది. కుక్కర్ మూతకి ఉండే రబ్బర్ ని మీరు గమనించే ఉంటారు. దీనిని గ్యాస్ కట్ అని పిలుస్తారు. ఎక్కువ వేడిని తట్టుకోవడం వలన, ఎక్కువ సార్లు ఉపయోగించబడడం వలన ఈ గ్యాస్ కట్ లూస్ అవుతూ ఉంటుంది. దీనివలన మూత గట్టిగా పట్టకుండా విజిల్ రావడం లేటు అవుతుంది. ఫలితంగా వంట ఆలస్యం అవుతూ ఉంటుంది.
Advertisement
అయితే.. కొత్త రబ్బర్ కొనడం లేదా కొత్త కుక్కర్ కొనుక్కోవడం కంటే, ఈ చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తే మీకున్న సమస్యను ఈజీ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో మీరు ఇక్కడ చూసేయండి. ఎక్కువ వేడికి గురి అవ్వడం వల్లే రబ్బర్ వదులుగా అవుతూ ఉంటుంది. ప్రెజర్ కుక్కర్‌లో వంట చేయడం సులభం. అయితే, రబ్బరు వదులుగా ఉన్నప్పుడు, వంట చేయడం కష్టం అవుతూ ఉంటుంది.
Advertisement
అయితే ఈ రబ్బర్ తిరిగి గట్టిగా అవ్వాలంటే దానిని చల్లబరచాలి. కుక్కర్ లో ఉడికించడం అయిన తరువాత ఆ రబ్బర్ ను వేరు చేసి చల్లని నీటితో కడగాలి. లేదా ఫ్రిడ్జ్ లో కొంత సేపు ఉండవచ్చు. ఫలితంగా అది కొద్దిగా బిగుతుగా మారి కుక్కర్ మూత పెట్టినప్పుడు టైట్ గా ఉంది ప్రెజర్ ని పట్టి ఉంచుతుంది. ఫ్రిడ్జ్ లో లేదా చల్లని ప్రాంతంలో పెట్టడం, చల్లని నీటితో కడగడం వలన రబ్బర్ గట్టిపడుతుంది. మరొక ఉపాయం కూడా ఉంది. కొంత పిండిని ముద్దగా చేసుకుని కుక్కర్ మూత చుట్టూ అంటించడం వలన కూడా మూత బిగుతుగా పట్టుకుని ప్రెజర్ ని ఆపుతుంది. అయితే.. ఇది తాత్కాలికంగా మాత్రమే పని చేస్తుంది.
మరిన్ని..
జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?
రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..?