Home » తమన్నాకు అనిల్ రావిపూడికి మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..?

తమన్నాకు అనిల్ రావిపూడికి మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈయన పేరు మార్మోగిపోతోంది. రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్, ఎఫ్ 2,ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు వంటి మూవీస్ తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే తాజాగా విడుదలైనటువంటి ఎఫ్ 3 సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకొని కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ తరుణంలోనే రావిపూడి మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ మిగతా సినిమాలను కూడా ప్రారంభిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు. సినిమా విజయవంతం అయింది అంటేనే భయం వేస్తోంది.

Advertisement

ఈ సినిమా సక్సెస్ అయితే ఇప్పుడు ఎంతగానో పొగిడి ఆకాశానికెత్తిన వారు సినిమా ఏదైనా బెడిసికొడితే మాత్రం ఇప్పుడు పొగిడిన వారే పాతాళానికి తొక్కి వేస్తారు అని భయం పెరిగిపోయిందని అన్నాడు అనిల్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నాకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా డైరెక్టర్. ఆయన మూవీస్ చేసే సమయంలో షూటింగ్ లో వాడినటువంటి వస్తువులను తీసుకువచ్చే మాకు ఇచ్చేవాడు అన్నారు అనిల్ రావిపూడి.

Advertisement

ప్రస్తుతం ఆయన బాలకృష్ణ తో యాక్షన్ మూవీ చేయబోతున్నారు. ఆయన యొక్క బలాన్ని అభిమానులను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీకి సంబంధించి స్క్రిప్టు తయారు చేసానని చెప్పారు అనిల్ రావిపూడి. ఒకవేళ దర్శకుడిగా చాలు అనుకుంటే మాత్రం దర్శకత్వాన్ని పక్కనపెట్టి నటుడిగా మారిపోతానని అన్నారు. అయితే ఎఫ్ 3 మూవీ ప్రమోషన్స్ లో తమన్నా కనిపించకపోవడం వెనక అసలు విషయం ఏమిటని, ఈమధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని అడగగా.. దీనిపై స్పందించిన రావిపూడి అలాంటివి ఏమీ లేవు అని తమన్నా అందరితో కలిసి మెలిసి ఉంటుందని బదులిచ్చారు.

also read;

KGF-2 మూవీ చూశారా.. రాఖీని చూసి ఈ 5 జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే..?

నాగచైతన్య కొరకు భారీ ప్రాజెక్టును రిజెక్ట్ చేసిన సమంత.. ఏం జరిగిందంటే..?

 

 

Visitors Are Also Reading