Home » కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టులు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..? 

కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టులు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..? 

by Anji

తెలంగాణ పోలీస్ ట్రాన్స్ ఫోర్టు విభాగంలో డ్రైవింగ్,మెకానిక్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 16 నుంచి రాష్ట్రంలో వర్షలు కురవడంతో కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టుల నిర్వహణకు ఆటంకం కలిగింది.  

Also Read :   తెలంగాణలో గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..!

దీంతో మార్చి 17, 18 తేదీలలో జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్షలు మార్చి 23, 24 తేదీలకు వాయిదా పడ్డాయి. పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్లు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ల ఎంపిక కోసం డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా కుదరకపోవడంతో టీఎస్ఎల్పీఆర్బీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

Also Read :  ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

 

అభ్యర్థులు మళ్లీ కొత్తగా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో హాజరుకావచ్చని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సూచించారు. డౌన్ లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

Also Read :  ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!

Visitors Are Also Reading