Home » BREAKING : BJP లోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

BREAKING : BJP లోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

by Bunty
Ad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు మెయిన్ విలన్ గా నిలిచారు. అయితే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం విడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సి ఉన్న అనివార్య కారణాలవల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది.

READ ALSO : ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!

Advertisement

బహుశా ఎల్లుండో, ఆ మరుసటి రోజో ఆయన కాంగ్రెస్ కు బై బై చెప్పి, బిజెపి అగ్ర నేతల సమక్షంలో బిజెపిలో చేరొచ్చు. అందుకు ముందు మీడియాతోను మాట్లాడే ఛాన్స్ ఉంది. కాగా, దీంతో బీజేపీలో చేరికకు నల్లారి కిరణ్ లైన్ క్లియర్ అయినట్లు అయింది. నల్లారి కిరణ్ ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజనపై యుపిఏ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ అప్పట్లో సీఎం పోస్ట్ కి,

Advertisement

READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ 2014లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ లో చేరిన ఆ పార్టీ వ్యవహారాలకు అంటి ముట్టనట్లుగానే ఉన్నారు. కొన్ని ఏళ్లుగా పూర్తి రాజకీయ ఆజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇకపై బీజేపీలోకి వెళ్లి జాతీయస్థాయిలో కీ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

READ ALSO : శ్రీ రెడ్డికి ఎప్పుడో పెళ్లయింది… భర్త ఎవరో తెలుసా?

Visitors Are Also Reading