దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. అంతే కాకుండా ఇతర గిఫ్ట్ లను కూడా ఇచ్చి ఉద్యోగులను సంతోష పెడుతుంటాయి. కాగా సూరత్ కు చెందిన ఓ కంపెనీ యజమాని ఉద్యోగులకు గిఫ్ట్ లు ఇవ్వడంతోపాటు కాలుష్యాన్ని నివారించే నిర్ణయం తీసుకున్నారు. సూరత్ కు చెందిన అలియన్స్ అనే సంస్థ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. అయితే కంపెనీ ఎదుగుదలలో ఎంతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని నిర్ణయించుకున్నారు.
Advertisement
company gifts electric scooters to employees
ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి దీపావళి కానుకగా ఎలక్ట్రిక్ బైక్ లను గిఫ్ట్ గా అందించాలని నిర్ణయించుకున్నాడు. దానికి కారణం ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పాటూ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని ఆలోచించాడు.
Advertisement
ఈ నేపథ్యంలోనే కంపెనీలోని మొత్తం 35 మంది ఉద్యోగులకు ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లను గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ ఒక్క స్కూటర్ ధర రూ.76,848 గా ఉంది. ఈ స్కూటర్ మూడు గంటలు ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది. ఇక తమ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి వెళ్ళడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ కంపెనీ యజమాని చెబుతున్నారు.