Home » తెలంగాణకు రానున్న చంద్రన్న.. వ్యూహం పలిస్తే బీఆర్ఎస్ కు కష్ట కాలమేనా..?

తెలంగాణకు రానున్న చంద్రన్న.. వ్యూహం పలిస్తే బీఆర్ఎస్ కు కష్ట కాలమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్ పాలన చేశారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ తరుణంలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టాడు సీఎం కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా బిఆర్ఎస్ ఆవిష్కరణ తర్వాత కర్ణాటక ఏపీ ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి.. దీంతో తెలంగాణ రాజకీయం చాలా రసవత్తరంగా సాగనుంది.. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో దూకుడు పెంచాలని చూస్తున్నాడు..

Advertisement

also read:ప్రతి రోజూ ఇలా స్కిప్పింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు..!

Advertisement

సరికొత్త వ్యూహంతో ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలంగాణలో టిడిపికి పట్టున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని మెల్లి మెల్లిగా పూర్వ వైభవం తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు.. దీంతో ఈనెల 21వ తేదీన జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ సభ కూడా ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని వారు భావించినట్టు తెలుస్తోంది.. దీనికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి రెండు సీట్లను టిడిపి గెలుచుకుంది.. ఆ తర్వాత ఈ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు..

కానీ ఖమ్మంలో మాత్రం టిడిపి పార్టీకి బలం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో తన రాజకీయ స్ట్రాటజీ ఖమ్మం నుంచి చూపించాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.. దీంతో ఈ నెల 21న బహిరంగ సభ నిర్వహించడానికి శ్రీకారం చుట్టాడు.. బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించినట్టు సమాచారం.. ఈ విధంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి టిడిపి ముందడుగు వేస్తే మాత్రం బిఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading