చాలామంది హీరోలు అవ్వాలని ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు. కొంతమంది హీరోగా సక్సెస్ అయితే కొంత మంది మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. హీరోగా మారాలని కొంతమంది కమెడియన్లు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలా ఫెయిల్ అయిన కమెడియన్ల గురించి చూద్దాం. కమెడియన్ కృష్ణ భగవాన్ హీరోగా మారాలని అనుకున్నారు. కానీ ఫెయిల్ అయ్యారు తన నటనతో బాడీ లాంగ్వేజ్ తో అందరినీ నవ్విస్తూ ఉంటారు. కృష్ణ భగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ అనే సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత ఇంకో సినిమాలో హీరోగా చేశారు. అవి ఫ్లాప్ అయ్యాయి. హీరోగా నిలబడాలని ఆశ నెరవేరలేదు. అవసరాల శ్రీనివాస్ కూడా ఫెయిల్ అయ్యారు.
Advertisement
ఆర్టిస్ట్ గా దర్శకుడిగా హోస్ట్‌గా అవసరాల శ్రీనివాస్ అందరికీ పరిచయమే. హీరోగా బాబు బాగా బిజీ సినిమా చేశాడు కానీ ఆకట్టుకోలేదు. ఫెయిల్ అయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి కూడా హీరోగా సక్సెస్ కాలేకపోయారు జంబలకడిపంబ వంటి సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. కమెడియన్ సప్తగిరి కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు. సప్తగిరి ఎల్ఎల్బి సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఇలా పలు సినిమాలు చేసినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. అలానే షకలక శంకర్ కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు. పలు సినిమాలు తో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు.
Advertisement
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు. తర్వాత హీరోగా మారి పులి రాజా అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. కమెడియన్ అయిన రాహుల్ రామకృష్ణ హీరోగా సినిమా చేసిన కూడా సక్సెస్ కాలేకపోయాడు. మహేష్ ఆచంట నేను నా నాగార్జున సినిమా లో హీరోగా చేశాడు. కానీ సినిమా సక్సెస్ కాలేదు. కమెడియన్ గానే సక్సెస్ వచ్చింది. వైవా హర్ష ఈమధ్య వరుస అవకాశాలుని సంపాదించుకుంటున్నాడు వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ సినిమా సక్సెస్ అవ్వలేదు హీరోగా ఫెయిల్ అయ్యాడు. అభినవ గోమటం హీరోగా మస్తు షేడ్స్ వున్నాయ్ రా తో హీరో గా మారాడు. మరి ఈ కమెడియన్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!