Home » స్టార్ హీరో అవ్వాల్సిన సుధాక‌ర్ ను తొక్కేసిందెవరు..? చివ‌రికి ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది..!

స్టార్ హీరో అవ్వాల్సిన సుధాక‌ర్ ను తొక్కేసిందెవరు..? చివ‌రికి ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది..!

by AJAY
Ad

టాలీవుడ్ లో గుర్తుండిపోయే క‌మిడియ‌న్స్ లో సుధాక‌ర్ కూడా ఒక‌రు. సుధాక‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్, వెంక‌టేష్ లాంటి హీరోల సినిమాలో న‌టించిన క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ స‌డెన్ గా అనారోగ్యం కార‌ణంగా సుధాక‌ర్ సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. అయితే నిజానికి సుధాక‌ర్ తమిళ స్టార్ హీరో అవ్వాల్సిందే. ఆయ‌న‌కు ర‌జినీకాంత్ రేంజ్ లో అక్క‌డ ఫాలోయింగ్ ఉండే కానీ సుధాక‌ర్ స్టార్ అవ్వ‌లేకపోయారు. క‌మెడియ‌న్ గానే మిగిలిపోయారు.

Advertisement

దానికి కార‌ణం ఏంటి అన్న సంగ‌తి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు కంటే ముందే సుధాక‌ర్ త‌మిళం లో చ‌రిత్ర సృష్టించాడు. సుధాక‌ర్ స్వ‌స్థ‌లం ప్ర‌కాశం జిల్లాలో ఉంది. సుధాక‌ర్ తండ్రి డిప్యూటి క‌లెక్ట‌ర్ కాగా తండ్రి విధుల వ‌ల‌న రాష్ట్ర‌మంతా ప‌నిచేశాడు. సుధాక‌ర్ చిరంజీవికి మంచి స్నేహితుడు. సుధాక‌ర్ చిరంజీవి, నారాయ‌ణ‌రావు, హ‌రిప్ర‌సాద్ తో క‌లిసి రూమ్ లో ఉండేవాడు. సుధాక‌ర్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో గొప్ప‌న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

యాక్టింగ్ స్కూల్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత మెగాస్టార్ కంటే ముందే సుధాక‌ర్ కు అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌మిళ్ వ‌రుస పెట్టి హిట్లు కొట్టాడు. దాంతో ఎంజీఆర్, జెమిని గ‌ణేష‌న్ సుధాక‌ర్ ను చూసి ముక్కున వేలేసుకున్నార‌ట‌. కానీ అక్క‌డ ఉన్న రాజ‌కీయాల వ‌ల్ల సుధాక‌ర్ టాలీవుడ్ కు వ‌చ్చేశాడు. అగ్ర‌హీరోలు, కొంత‌మంది న‌టులు క‌లిసి కుట్ర‌లు ప‌న్ని సుధాక‌ర్ ను తొక్కేశారు అని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.

త‌మిళంలో చేసిన 40కి పైగా సినిమాల్లో 30కి పైగా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వ‌చ్చిన త‌ర‌వాత క‌మెడియ‌న్ గా విల‌న్ గా చేస్తూ సుధాక‌ర్ ఫుల్ బిజీ అయ్యాడు. 1990 కాలంలో ఏ సినిమా వ‌చ్చినా అందులో సుధాక‌ర్ క‌చ్చితంగా క‌నిపించేవాడు. దాదాపు 600 పైగా చిత్రాల‌లో సుధాక‌ర్ న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. కానీ అనారోగ్య‌కార‌ణాల వ‌ల్ల వెండితెర‌కు దూర‌మైన సుధాక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీఎంట్రీ ఇవ్వ‌లేదు.

ALSO READ :

బాలకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవటానికి కారణం అదేనా ?

ఆచార్య‌లో కాజ‌ల్ ను మాత్ర‌మే కాదు వాళ్ల‌ను కూడా లేపేశార‌ట‌..!

Visitors Are Also Reading