Home » కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు ప్రస్తుతం అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో.. అతను ఎవరో తెలుసా ?

కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు ప్రస్తుతం అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో.. అతను ఎవరో తెలుసా ?

by Anji
Ad

గోదావరి యాసతో తనదైన మాటకారితనంతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీగణపతి గురించి తెలుగు సినిమా అభిమానులకు బాగానే తెలుసు. రైటర్ కేరీర్ ప్రారంభించి ఇక ఆ తరువాత యాంకర్ గా పలు షోలను చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ కమెడియన్ గా 50కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన అల్లరి మూవీ ద్వారా ఈయనకు మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పవచ్చు. 

Advertisement

తన తమ్ముడు దర్శకత్వం వహించిన బాబీ మూవీలో కూడా ఈయన నెగటివ్ పాత్రలో నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా దర్శకుడు శోభన్ లక్ష్మీపతికి తమ్ముడు అవుతారు. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ తెలుగులో క్రేజీ హీరోగా ప్రస్తుతం గుర్తింపు సంపాదించుకున్నాడు. లక్ష్మీపతి అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, తొట్టిగ్యాంగ్, పెదబాబు, కితకితలు, అందాల రాముడు, అత్తిలి సత్తిబాబు LKG  వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 

Advertisement

ఇక ఆ తరువాత సినీ అవకాశాలతో చాలా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన గుండె పోటుతో మరణించారు. ఈయనకు శ్వేత, కేతన్ అనే ఇద్దరూ సంతానం కలరు. ఈయన తమ్ముడి కొడుకు సంతోష్ శోభన్ 2011లో వచ్చిన  గోల్కొండ హై స్కూల్ సినిమాలో క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా బాగా అలరించాడు. 2015లో థాను నేను చిత్రంలో అవికా గోర్ తో కలిసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొంచెం గ్యాప్ తీసుకొని ఇక ఆ తరువాత పేపర్ బాయ్ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు సంతోష్ శోభన్.2021లో ఏక్ మినికథలో స్మాల్ పెనిస్ సిండ్రోమ్ తో బాధపడుతున్న యువకుడిగా సంతోష్ నటించాడు.  ప్రస్తుతం ఈయన అన్ని మంచి శకునములే అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తొలిప్రేమకి నిర్మాత రెమ్యూనిరేషన్ ఇవ్వలేనన్నప్పుడు “పవన్” చెప్పిన ఒక్క మాట ఏంటంటే ?

 తల్లి పాత్రలో నటించే సీనియర్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…!

జబర్దస్త్ నరేష్ వయస్సు ఎంత? అతని భార్య ఎవరు…?

Visitors Are Also Reading