Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Comedian Ali: కమెడియన్ ఆలీ లవ్ స్టోరీ.. సినిమాను మించిన ట్విస్ట్ లు..?

Comedian Ali: కమెడియన్ ఆలీ లవ్ స్టోరీ.. సినిమాను మించిన ట్విస్ట్ లు..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ కమెడియన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఆలీ.. ఈయన కామెడీ టైమింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఇండస్ట్రీలో అంత క్లిక్ అయ్యారు.. అలాంటి కమెడియన్ ఆలీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. అలాంటి ఆలీ ఆలీతో సరదాగా షో లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.. ఇంతకీ ఆ షో లో ఆలీ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Ad

also read:Telangana: తెలంగాణకు మరో సెంట్రల్ మినిస్టర్ పదవి.. ఆ ఎంపికే ఛాన్స్ ఉందా..?

నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఆలీ మనోడు అని పిలుచుకునేలా ఉంటానని, చచ్చే వరకు ఇదే మైంటైన్ చేస్తానని పేర్కొన్నారు. నేను మంచితనంతో ఉంటే నా పిల్లలకు మేలు కలుగుతుందని వారు కూడా మంచితనంతో ఉంటారని చెప్పుకొచ్చారు.. నా సినీ కెరియర్ లో మొదటిసారి సీతాకోక చిలుక సినిమాకు అవార్డు అందుకున్నానని, అలాగే నేను నటించినటువంటి యమలీల సినిమా ఏడాది పాటు ఆడిందని ఆలీ అన్నారు. ఇప్పటివరకు 150 పైగా చిత్రాల్లో తాగుబోతు క్యారెక్టర్ చేశానని, సౌత్ భాషలను కూడా మాట్లాడగలనని వారు మాట్లాడింది అర్థం చేసుకోగలిగే శక్తి ఉందని తెలియజేశారు. అంతేకాకుండా షోలే సినిమా వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, నా కామెడీ అంటే పూరి జగన్నాథ్ కు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

అప్పట్లో మా ఇంటికి దగ్గర ఒక అమ్మాయి ఉండేదని, ఆమె అంటే నాకు చాలా ఇష్టమని ఒకరోజు ఆ అమ్మాయి వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే నేను గొడుగు కొనుక్కొని వచ్చి మరీ ఇచ్చానని ఆలీ తెలియజేశారు. కానీ ఆ అమ్మాయి అమ్మకు నేను నచ్చలేదని అందువల్లే వివాహం వద్దని అనుకున్నారని తన లవ్ స్టోరీ ని బయట పెట్టారు. ఆ తర్వాత మరో అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉన్న ఆగిపోయిందని పేర్కొన్నారు ఆలీ.. దీని తర్వాత జుబేదాను వివాహం చేసుకున్నానని తెలిపారు. నాకు పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధం ఉందని, మా మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదని , కొన్ని వెబ్ సైట్ల వారు గ్యాప్ క్రియేట్ చేశారని తెలియజేశారు ఆలీ. ఆలీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

Advertisement

also read:

Visitors Are Also Reading