Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » టాలీవుడ్ పై కమెడియన్ ఆలీ సంచలన వ్యాఖ్యలు …!

టాలీవుడ్ పై కమెడియన్ ఆలీ సంచలన వ్యాఖ్యలు …!

by AJAY
Ads

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పక్కనోళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకునేవాళ్లు టాలీవుడ్ లో ఉన్నారంటూ ఆరోపించారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా వాళ్ళు చంకలు గుద్దుకోవడం ఏంటో అని వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ధోరణి పెరిగిపోయిందని అలాంటి దురాలోచనలు మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

Ad

పక్కనోళ్లు బాగుండాలని కోరుకుంటే అంతకు మించిన మంచి మీక్కూడా దొరుకుతుంది అంటూ కామెంట్ చేశారు. బాగున్న సినిమా కు కూడా కొందరు బాగాలేదని ప్రచారం చేస్తున్నారని ఆలీ ఫైర్ అయ్యారు. అలా చేసేవాళ్ళు కూడా ఇండస్ట్రీ లోనే ఉన్నామని గుర్తు ఉంచుకోవాలని చెప్పారు. అంతే కాకుండా చెన్నై లో తెలుగు పరిశ్రమ ఉన్నప్పుడు ఇలాంటి వి లేవని చెప్పారు. అలాంటి ఆలోచనలు కూడా ఉండేవి కావని అన్నారు.

Advertisement

ఎఫ్ 3 సినిమా నిన్న విడుదల కాగా హౌస్ కలెక్షన్స్ వచ్చాయని ఆ విషయం తెలిసి నటులంతా సంతోషించారు అని చెప్పారు. ఇదిలా ఉండగా ఎఫ్ 3 సినిమా దర్శకుడు సైతం ఇలాంటి కామెంట్స్ నే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆలీ కూడా ఘాటుగా స్పందించడం తో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading