Home » ఆచార్య, రాధేశ్యామ్, సర్కారువారిపాట సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గుర్తించారా…?

ఆచార్య, రాధేశ్యామ్, సర్కారువారిపాట సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గుర్తించారా…?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ నుండి రీసెంట్ గా విడుదలైన మూడు బడా సినిమాలు ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారి పాట. ముగ్గురు స్టార్ హీరోలు చేసిన సినిమాలు థియేటర్లలో బ్యాక్ టౌ బ్యాక్ విడుదల అయ్యాయి. కాగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి హీరోలుగా నటించగా ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Radheshyam Movie

Radheshyam Movie

ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా రాధేశ్యామ్ వ‌సూళ్ల‌ను రాబట్టలేకపోయింది. ఇక ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా సర్కారు వారి పాట విడుదలైంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మిక్సడ్ టాక్ వస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సర్కారు వారి పాట‌ భారీ వసూళ్లను రాబడుతోంది.

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా ఈ మూడు సినిమాల్లో ఒకే కామన్ పాయింట్ ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మూడు సినిమాలను కూడా హీరోల కుటుంబ సభ్యులే నిర్మాతలుగా వ్య‌హ‌రించిన‌ సంగతి తెలిసిందే. కాబ‌ట్టి ఈ మూడు సినిమాలలో కూడా హీరోల కుటుంబ స‌భ్యులే నిర్మాతలుగా వ్యవహరించడం కామన్ పాయింట్. సర్కారు వారి పాట‌ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యాన‌ర్ మరియు మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంజీ సంయుక్తంగా నిర్మించాయి.

అదే విధంగా ఆచార్య సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కొణిదెల ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధేశ్యామ్ సినిమా విష‌యానికి వస్తే ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ తో పాటు మహేష్ బాబు పెద్ద నాన్న కృష్ణం రాజు సొంత బ్యానర్ అయిన‌ గోపి కృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. రాధేశ్యామ్ సినిమా నిర్మాణానికి సంబంధించిన పనులను కృష్ణంరాజు కుమార్తె ద‌గ్గ‌రుండి చూసుకున్నారు.

Also read :

భార్యలు భర్తలను ఎందుకు పేరు పెట్టి పిలవకూడదు… అలా పిలిస్తే ఏం జరుగుతుంది…!

శృతిహాసన్ తల్లికి ఏంటి ఈ కష్టాలు..డబ్బుల్లేక చివరికి స్టేజ్ షోలలో…!

Visitors Are Also Reading