Home » అఖండ, ఆర్ఆర్ఆర్ తో పాటూ బింబిసార సినిమాలో ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

అఖండ, ఆర్ఆర్ఆర్ తో పాటూ బింబిసార సినిమాలో ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

by AJAY
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మొదటి షో తోనే పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. దాంతో ఫస్ట్ డే ఆరు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

Advertisement

దాంతో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా బింబిసార నిలిచింది. ఇదిలా ఉండగా బింబిసార సినిమాలో కథ మొత్తం పాప చుట్టూ తిరుగుతుంది.

Advertisement

పాప చుట్టూ తిరిగే కథలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా టాలీవుడ్ లో ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ ఆర్ఆర్ఆర్ సినిమాలలో కూడా ఇదే కామన్ పాయింట్ ఉంది.

అఖండ సినిమాలో సైతం కథ మొత్తం పాప చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలయ్య మాస్ ఆడియన్స్ కు మరోసారి పూనకాలు తెప్పించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కథ మొత్తం పాప చుట్టే తిరుగుతుంది. మల్లి అనే పాపను బ్రిటిష్ అధికారులు ఎత్తుకెళ్లడం…. ఆ తర్వాత ఎన్టీఆర్ పాప కోసం విరోచితమైన పోరాటం చేయడం ఈ సినిమాలో కనిపిస్తుంది. అలా ఈ మూడు సినిమాల్లో ఉన్న ఒకే కామన్ పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్ ల చుట్టూ తిరుగుతుంది.

Visitors Are Also Reading