Telugu News » Blog » సీఎం NTR నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఎన్టీఆర్ ఘాట్….ఎన్టీఆర్ స్పంద‌న ఇదే..!

సీఎం NTR నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఎన్టీఆర్ ఘాట్….ఎన్టీఆర్ స్పంద‌న ఇదే..!

by AJAY

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కొన‌సాగాల‌ని మ‌రిన్ని సూప‌ర్ హిట్ సినిమాలు చేయాల‌ని కొంత‌మంది నంద‌మూరి అభిమానులు కోరుకుంటే మ‌రికొంద‌రు మాత్రం ఎన్టీఆర్ వీలైనంత త్వ‌ర‌గా టీడీపీ ప‌గ్గాలు చేత‌ప‌ట్టాల‌ని కోరుకుంటూ ఉంటారు. గ‌తంలో చాలా సార్లు ఎన్టీఆర్ సీఎం అంటూ ప్లెక్సీలు ద‌ర్శ‌నమిచ్చాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ వెళ్లిన చాలా చోట్ల ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు వినిపించాయి. మీడియా కూడా వంద‌ల సార్లు ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఎప్పుడు అనే ప్ర‌శ్న వేస్తూనే ఉంటుంది.

ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా కూడా ఎన్టీఆర్ కు ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ నేరుగా ఎన్టీఆర్ ను ప్ర‌శ్నించారు. దానికి ఎన్టీఆర్ త‌న పూర్తి ఫోక‌స్ సినిమాల‌పైనే అని చెప్పారు. ఇప్పుడు త‌న‌కు రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఉద్ద్యేశం లేద‌ని మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని సినిమాల్లోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.అయిన‌ప్ప‌టికీ ఈ రోజు మ‌ళ్లీ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు వినిపించాయి.

 

 

త‌న తాత‌గారు ఎన్టీరామారావు శ‌త‌జయంతి సంధ‌ర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకుని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రియు క‌ల్యాణ్ రామ్ లు నివాళ్లు అర్పించారు. ఈ సంధ‌ర్భంగా అభిమానులు ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ సీఎం నినాదాల‌తో మార్మోగిపోయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం దీనిపై స్పందించ‌లేదు. అభిమానులు నినాదాలు చేస్తుంటే అక్క‌డ నుండి సైలెంట్ గా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

You may also like