Home » దేశం దారి త‌ప్పుతోంది.. దేశ రాజ‌కీయాల‌పై కేసీఆర్ మ‌రోసారి కామెంట్స్‌..!

దేశం దారి త‌ప్పుతోంది.. దేశ రాజ‌కీయాల‌పై కేసీఆర్ మ‌రోసారి కామెంట్స్‌..!

by Anji

దేశ రాజ‌కీయాల‌పై మ‌రొక‌సారి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేసారు. దేశం దారి త‌ప్పుతోంద‌ని, దుర్మార్గ‌మైన ప‌నులు దేశంలో జ‌రుగుతున్నాయ‌ని విరుచుకుప‌డ్డారు. బుధ‌వారం మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రారంభించిన త‌రువాత మీడియాతో మాట్లాడారు. క‌ర్నాట‌క‌లో మ‌త‌క‌ల్లోలాలు సృష్టించార‌ని, ఆడ‌పిల్ల‌లు అక్క‌డ చ‌దువుకోవాలంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. దేశంలో ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఉంటేనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని.. మ‌త‌కల్లోలాలు జ‌రిగితే ఎవ‌రైనా ఇక్క‌డ ప‌రిశ్ర‌మలు పెడ‌తారా అని ప్ర‌శ్నించారు.

Also Read :  అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ

ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాలు కొన‌సాగే విధంగా ముందుకు వెళ్తాన‌ని.. హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే ఐటీ అభివృద్ధి చేసిన‌ట్టు పేర్కొన్నారు. మ‌న క‌ల‌లు క‌న్న తెలంగాణను స‌స్య‌శ్యామ‌లంగా చూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో నిర్మించ‌బ‌డ్డ అతి భారీ జ‌లాశ‌యం అయిన‌టువంటి మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రారంభించుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. గోదావ‌రి నీళ్లు తెచ్చి కొముర‌వెళ్లి మ‌ల్ల‌న్న పాదాల‌ను క‌డుగ‌బోతున్నామ‌ని.. గోదావ‌రి జ‌లాల‌తో అభిషేకం చేయ‌బోతున్నామ‌ని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టును త‌ల‌ద‌న్నే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జ‌రిగింద‌ని.. సిద్దిపేట కు మాత్ర‌మే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి శాశ్వ‌తంగా దాహ‌ర్థిని తీర్చేందుకు మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేసీఆర్ తెలిపారు. దాదాపు 58 వేల మంది కార్మికులు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్ట్ కోసం ప‌ని చేశార‌ని వెల్ల‌డించారు.

బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్ట్‌గా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ 9 జిల్లాల వ‌ర ప్ర‌దాయినిగా నిలిచింద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అతిపెద్ద రిజ‌ర్వాయ‌ర్ మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ అని, నూత‌న తెలంగాణ నిర్మించుకున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే అని సీఎం వివ‌రించారు. నిర్మాణం జ‌రుగుతున్న సంద‌ర్భంలో ప‌లువురు ప్రాజెక్ట్ ప‌నుల‌ను ఆపాల‌ని ప్ర‌య‌త్నించార‌ని.. కొంత మంది కోర్టుకు కూడా వెళ్లార‌ని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌ను ఆపే కుట్ర‌లో భాగంగా వంద‌లాది కేసులు వేశార‌ని వెల్ల‌డించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకెళ్లి మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్ట్ పూర్తి చేశామ‌ని కేసీఆర్ తెలిపారు.

Also Read :  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్య‌కుమార్ – వెంక‌టేష్ అయ్య‌ర్‌లు ఎన్నో స్థానంలో నిలిచారో తెలుసా..?

Visitors Are Also Reading