Home » పవన్ కళ్యాణ్ భార్యలపై జగన్ హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ భార్యలపై జగన్ హాట్ కామెంట్స్

by Bunty
Ad

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఈ  నేపథ్యంలోనే పవన్ మూడు పెళ్లిళ్ల పై నిప్పులు చెరిగారు సీఎం జగన్.  అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీ, ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల తీరు ఉందని ఆయన విమర్శించారు.

 

Advertisement

దత్త తండ్రిని నెత్తిన పెట్టుకొని దత్తపుత్రుడు ఊరేగుతున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్ డైలాగులు వల్లే వేస్తున్నాడని ఆయన విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్న పవన్ కళ్యాణ్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ప్రజలు ఆయనను ఓడించారని జగన్ గుర్తు చేశారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇస్తాడు అన్నారు. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడని చెప్పారు. బాబు స్క్రిప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ నటిస్తాడని జగన్ చెప్పారు. ప్రతి వర్గాన్ని వంచించిన చంద్రబాబు సభలకు జనం ఎందుకు వస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, మోసాలు మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. 87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.

Visitors Are Also Reading