ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అప్పట్లో అమరావతి, ఆ తర్వాత మూడు రాజధానులు, ఇప్పుడు అసలు రాజధాని ఉందో లేదో అనే ఒక సందేహం వ్యక్తం చేస్తారు జనం. అయితే ఇప్పుడు అలాంటి సందేహాలు అన్ని పటాపంచలు కాబోతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని తెలుస్తోంది. అందుకు సీఎం జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Advertisement
ఏపీ రాజధానిని వైజాగ్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం కొంత కాలంగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగానికి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు.
Advertisement
అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం మౌఖిక ఆదేశాలు అందుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించిన సమాచారం ఏ క్షణంలో వచ్చిన ఏర్పాటు చేసేందుకు వీలుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను మూడో కంటికి తెలియకుండా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండడానికి బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. అన్ని అనుకూలిస్తే మార్చి 22,23 తేదీల్లో గృహప్రవేశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
read also : నర్సుల దెబ్బకు దిగివచ్చిన బాలయ్య.. సోషల్ మీడియాలో పోస్ట్ !