ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకు ఇస్తున్న వివిధ సిరీస్ ల స్థానంలో ఇకపై ఓ కొత్త సిరిస్ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలోని ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జి సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?
Advertisement
ఇప్పటివరకు ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్ నెంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేట్ వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.
Advertisement
READ ALSO : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు
వీటి స్థానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జి సిరీస్ నెంబర్ కేటాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రైవేట్ నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు.
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…