ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీ రామారావు, కృష్ణ మధ్య గొడవలు ఉండేవని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల మహేష్ బాబు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో కూడా ఈ అంశం పై చర్చించారు. మహేష్ బాబు మాత్రం ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతూ వచ్చారు. కానీ అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం కృష్ణ ఎన్టీఆర్ ల మధ్య గొడవలకు ఓ సినిమా ముఖ్య కారణం అయ్యింది.
Advertisement
ఎన్టీఆర్ తాను చేయాలనుకున్న సినిమాను కృష్ణ చేశాడనే కోపంతో కొన్నేళ్లపాటు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్ అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉన్న సమయంలో కృష్ణ హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే కృష్ణ కూడా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కంటే 20 ఏళ్లు చిన్నవాడైన కృష్ణకు యూత్ లో అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. దాంతో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేదట.
Also Read: 100 నుండి 1000 రోజులు ఆడిన 10 టాలీవుడ్ సినిమాలు..!
Advertisement
అయితే అదే సమయంలో కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా చేస్తున్న సందర్భంలో కృష్ణ వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే…. దాంతో ప్రేమ కావ్యాలు, మాస్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాల్సిన అలాంటి సమయంలో కృష్ణ.. అల్లూరి సీతారామరాజు సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కృష్ణ తో సినిమా ఆపేయాలని కోరారట.
కానీ కృష్ణ అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రామచంద్రరావు మరణించడంతో హీరో కృష్ణ తానే ఈ సినిమాలో మిగిలిన పార్ట్ కు దర్శకత్వం వహించారు. 1974 మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత కృష్ణ ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి. మళ్లీ 1982లో వయ్యారి భామలు సినిమాలో ఎన్టీఆర్ కృష్ణ కలిసి నటించారు. ఈ సినిమా కంటే ముందు ఇద్దరి మధ్య చాలా కాలం పాటు గ్యాప్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు
Also Read: దానవీరశూర కర్ణకు బడ్జెట్ తో పోలిస్తే 15 రెట్లు లాభాలు