పరిచయం :
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్ కలిసి నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ రెండు ఎపిసోడ్ లు విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంజర్స్ ది ఎండ్ గేమ్ నిర్మాత ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సిరీస్ లో నటించడంతో ఇండియాలో సైతం సిరీస్ క్రేజ్ పెరిగింది. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండగా రెండు ఎపిసోడ్ లు అందుబాటులోకి వచ్చాయి. వారానికి ఒకటి చొప్పున మిగిలిన నాలుగు ఎపిసోడ్ లను విడుదల చేయనున్నారు. ఇక ఈ రెండు ఎపిసోడ్ లు ఎలా ఉన్నాయి…? అనేది ఇప్పుడు చూద్దాం…
Advertisement
కథ : సిటాడెల్ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ప్రజలందరికీ బధ్రత లక్ష్యంగా దీనిని స్థాపిస్తారు. అయితే సిటాడెల్ ను నాశనం చేయాలని ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు కోటీశ్వరులు కలిసి మాంటిక్ అనే కొత్త స్పై సంస్థను ఏర్పాటు చేస్తారు. అయితే సిటాడెల్ లో ప్రముఖ ఏజెంట్ లు అయిన ప్రియాంక చోప్రా, రిచర్డ్ లను తప్పుదోవ పట్టించి వాళ్ళను అంతం చేసేందుకు మాంటిక్ ప్రయత్నిస్తుంది. ఆ దాడి నుండి ఇద్దరు తప్పించుకున్నారా..? లేదా..? అనేది ఈ సిరీస్ కథ.
Advertisement
విశేషణ : మిగతా జోనర్ లతో పోలిస్తే స్పై థ్రిల్లర్ లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక సిటాడెల్ కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ లు అదిరిపోయే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లెట్ల వర్షం బాంబుల మోతతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికి విడుదల చేసింది రెండు ఎపిసోడ్ లు మాత్రమే అయినప్పటికీ మిగతా 6 ఎపిసోడ్ లపై ఆసక్తి పెరిగింది. ఇక రెండు ఎపిసోడ్ లు ఆకట్టుకోగా…. మిగతా నాలుగు ఎపిసోడ్ లు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి నెలకొంది.
ALSO READ :ఓటిటిలోకి వచ్చేసిన ‘రావణాసుర’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?