Home » గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్న లేడీ కొరియోగ్రఫర్‌

గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్న లేడీ కొరియోగ్రఫర్‌

by Bunty
Ad

ప్రముఖ సినీ డాన్సర్ దర్శకురాలు రాధిక గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు. ఏ ఎం ఎస్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్ ఆర్.జె.రామా నారాయణ నాట్యకళను ప్రోత్సహించే ఈ విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Advertisement

సినీ దర్శకురాలు రాధిక బృంద నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా,అదేవిధంగా ఆన్ లైన్ ద్వారా రోజూ ఓ గంట చెప్పు ఆడియో సాంగ్స్ చొప్పున 365 రోజులు నిర్వహించారు. ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరి రోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్య కళా కార్యక్రమం గిన్నిస్ బుక్ లో నమోదయింది.

న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు బుక్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తిలకించారు. పాండిచెర్రి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులు అభినందించడం తో పాటు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు ప్రధానం చేశారు.

Visitors Are Also Reading