ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగు లేని నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏడు సంవత్సరాలు ఆయన పాలించారు. అయితే.. అంతటి తిరుగు లేని నాయకుడినే ఓ వ్యక్తి ఓడించారని తెలుసా? ఆయన పేరు జక్కుల చిత్తరంజన్ దాస్. ఈయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు.
Advertisement
ఈయన విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రయాణాన్ని ఈయన ప్రారంభించారు. కాంగ్రెస్ లోనే అనేక హోదాల్లో పని చేసి, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. కల్వకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్త రంజన్ దాస్ జనతాపార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Advertisement
1989 లో అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి కల్వకుర్తి నియోజక వర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేసారు. ఈసారి ఏకంగా అన్నగారు నందమూరి తారక రామారావు పైనే గెలుపొందారు. దాదాపు 3,568 ఓట్ల మెజార్టీతో ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం లోనే కొనసాగారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో టూరిజం శాఖామంత్రిగా, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేసారు.
ఆ తరువాత 1994 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత 1999 లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ పార్టీ లో చేరారు. ఆ తరువాత మళ్ళీ కాంగ్రెస్ కె వచ్చి ఓబిసి సెల్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తరువాత 2018 లో కూడా జడ్చెర్ల నియోజక వర్గాల్లో పోటీ చేయాలనీ భావించినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తరువాత ఆయన బిజెపి పార్టీ కూడా మారారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!