Home » చిరు ఫేవరెట్ హీరో.. ఆయన డాన్స్ చాలా ఇష్టమట.. గెస్ చేయండి..?

చిరు ఫేవరెట్ హీరో.. ఆయన డాన్స్ చాలా ఇష్టమట.. గెస్ చేయండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. చిరంజీవి గురించి చెప్పాలి అంటే ఈ పదాలు సరిపోవు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా నాలుగు దశాబ్దాలపాటు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ ఆరు పదుల వయసు దాటిన కుర్ర హీరోలకు దీటుగా నటిస్తూ వస్తున్నారు. అలాంటి చిరంజీవికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు దేవుడిలా కొలుస్తారు.

Advertisement

also read:India vs New Zealand, 2nd ODI : టీమిండియా జైత్ర యాత్ర.. కివీస్ పై 2-0తో వన్డే సిరీస్ కైవసం

అంతటి స్టార్ డం ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అరడజన్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇంతటి స్టార్ హోదా సంపాదించుకున్న చిరంజీవికి ఇండస్ట్రీలో ఆ హీరో అంటే చాలా ఇష్టమట. ఆయనే తన ఫేవరెట్ కూడా నట. మరి ఆ హీరో ఎవరో తెలుసుకుందాం..

Advertisement

చిరంజీవి ఫేవరెట్ అంటే ఆయన వారసుడు రామ్ చరణ్ అని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. చిరంజీవికి అత్యంత ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్.. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తారట. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయంటే చాలు తప్పకుండా చిరంజీవి చూస్తారట. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మీడియా ముందు ఎన్టీఆర్ ను పొగిడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

also read:

Visitors Are Also Reading