బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ గా ఎదిగిన టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తున్నాడు.
Advertisement
ఇక తన కెరీర్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి అదేవిధంగా షాపులు కూడా ఉన్నాయి ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా చిత్రాలలో చక్రం ఒకటి. ప్రభాస్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అసిన్, ఛార్మి హీరోయిన్ లుగా నటించారు.
పద్మాలయ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం 2005 మార్చి 25న విడుదల అయింది. ఇందులో ప్రభాస్ అందరి ముఖాల్లో నవ్వులు నింపాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ తాను మాత్రం ఒంటరే. తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని దిగమింగుతూ జనాలకు సంతోషాన్ని పంచాలని భావిస్తాడు. చివరకు అనంత లోకాలకు వెళ్లిపోతాడు.
వాస్తవానికి అప్పటి తెలుగు సినిమాలలో హీరో చనిపోతే ప్రేక్షకులు ఎవ్వరూ చూడరనే నానుడి ఉంది. అందుకే ప్రభాస్‌ను ఈ సినిమా చేయవద్దని సన్నిహితులు కూడా సూచించారట. ఈ సినిమాను చిరంజీవి, మహేష్‌బాబు, గోపిచంద్ వంటి హీరోల వద్దకు వెళ్లినా తాము ఈ సినిమా చేయడానికి సాహసం చేయలేమని చెప్పారట.
Advertisement
చిరు, మహేష్ వద్దు అన్నా సినిమాను మొహమాటానికి పోయి ప్రభాస్ టేకప్ చేసాడు. కట్ చేస్తే.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్లాప్‌ను మూటగట్టుకుని నిర్మాతలకు, బయ్యర్లకు ఊహించని నష్టాలను మిగిల్చింది. హీరో చనిపోతే ప్రేక్షకులు సినిమా చూడనే నానుడిని చక్రం సినిమా మరొక రుజువు చేసింది.
ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె సందీప్‌రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : టాటా సూపర్ యాప్ విడుదల.. టాటా న్యూ గురించి తెలుసా..?