చిరంజీవి జగన్ కి దెబ్బ కొట్టారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కనపడుతోంది. సినిమా వాళ్ళ విషయంలో జగన్ ప్రభుత్వం చూపించిన అమర్యాద, అవమానాలు ఇప్పుడు టాలీవుడ్ లో మెగా అభిమానుల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి గతంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను విన్నవించడానికి తోటి హీరోలు దర్శక నిర్మాతలతో కలిసి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. సినిమా టికెట్ రేట్లను ఐదు రూపాయలు చేశారు దీంతో కొంతమంది సినిమా వాళ్ళతో కలిసి జగన్ తో సమావేశమైనా చిరంజీవి చేతులు జోడించి జగన్ ని వేడుకున్నారు.
Advertisement
పెద్దమనిషి హోదాలో ఉన్న తమరు పెద్ద మనసుతో ఆదుకోవాలని ఆయన జోడించారు చిరంజీవి అంతటి సినిమా పెద్ద వెళ్లి అడిగినా జగన్ చలించలేదు. ఆయనకు అవమానం జరిగినట్లే అభిమానులు ఫీల్ అయ్యారు. తెలుగు సినిమా చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారని కూడా చూడకుండా ఇంటికి పిలిపించి అవమానించారు అయినా ఇండస్ట్రీ కోసం ఆయన భరించారు. వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అని అందరూ అన్నారు కానీ అస్సలు జగన్ పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.
Advertisement
Also read:
చిరంజీవిని స్వయంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల ఎంపికైన జనసేన ఎమ్మెల్యే గందుల దుర్గేష్ కలిసారు. విశ్వంభర సెట్స్ కి వచ్చిన ఆయన చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యత స్వీకరణ చేసిన విషయం తెలిసిందే. కందుల దుర్గేష్ ఏపీ పర్యటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా చిరు ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు ఇలా జరిగింది ఇప్పుడు చూడండి అంటూ మోత మోగిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!