Home » chiranjeevi: చిరంజీవి చెప్పిన పల్లీల పొట్టు వెనుక ఇంత స్టోరీ ఉందా..?

chiranjeevi: చిరంజీవి చెప్పిన పల్లీల పొట్టు వెనుక ఇంత స్టోరీ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈసారి సంక్రాంతి పండుగను మెగా అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీ డబల్ డోస్ పండుగ వాతావరణం కనిపించిందని చెప్పవచ్చు. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్. అయితే చిరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమాలో జరిగిన ఒక క్రేజీ సన్నివేశం గురించి వెల్లడించారు. ఈ చిత్రంలో చిరంజీవి పల్లీలు నములుతూ దాని పొట్టును మాస్ గా గాల్లోకి ఊదే సన్నివేశం ఉంటుంది.

Also Read:  “దృశ్యం” లో వెంకటేష్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

Advertisement

 

ఈ సన్నివేశం కోసం ఇంట్లో జరిగిన ఒక సరదా సన్నివేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.. అయితే ఈ సీన్ తీయడం కోసం చిరంజీవి స్పెషల్ గా ఇంటి నుంచే పల్లీల పొట్టును తీసుకొచ్చారట.. ఇంట్లో పనిమనిషికి ఈ విషయం చెప్తే పల్లీల పొట్టు ఇవ్వమని అడిగితే .. దానికి ఆమె కావాలంటే పల్లీలు ఇస్తానని పొట్టు ఇవ్వనని చెప్పిందట. ఆ విధంగా అనేసరికి ఏం చేయాలో అర్థం కాలేదని చిరు గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఏదో ఒక విధంగా ఆమెకు చెప్పి పాకెట్ నిండా పల్లీల పొట్టు పట్టుకుని లోకేషన్ కి వచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read:  అచ్చం సౌందర్య మాదిరిగానే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

పాత్ర విషయంలో ఆయన ఎంత నిబద్దతతో ఉంటారో దీన్ని చూస్తే అర్థం అవుతుంది. షూటింగ్ సమయంలో షాట్ రెడీ అయ్యే సమయానికి పల్లీలపొట్టు దొరక్కపోతే ఇబ్బంది అవుతుందని ఇంటి నుంచే పొట్టు తీసుకెళ్లానని అన్నారు. అంతేకాదు ఈ సినిమాలో వాటర్ సీక్వెన్స్ ప్రతి షాట్ లోను తాను నటించానని, డూపును పెడతామని అన్నా కానీ నేను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. నేను డబ్బులు తీసుకునేది నటించడానికేనని ఎంత కష్టమైనా పడతానని తెలియజేశారు. చిత్రంలో చిరు గెటప్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఆయన పర్ఫామెన్స్ చూసి అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading