Telugu News » Blog » చిరంజీవి స‌పోర్ట్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ బాల‌య్య బాబు సినిమా ఏదో తెలుసా..?

చిరంజీవి స‌పోర్ట్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ బాల‌య్య బాబు సినిమా ఏదో తెలుసా..?

by AJAY
Ads

టాలీవుడ్ లోని స్టార్ హీరోల లిస్ట్ లో చిరంజీవి బాల‌య్య‌కు ప్ర‌త్యేమైన క్రేజ్ ఉంటుంది. చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. బాల‌య్య నంద‌మూరి వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. చిరు , బాల‌య్య ఇద్ద‌రూ కూడా అన్ని ర‌కాల పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులను మెప్పించారు. ఇద్ద‌రూ స్టార్ హీరోలు అయినా వీరిద్ద‌రి మ‌ధ్య సినిమాల ప‌రంగా ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ మాత్రమే ఉండేది. ఇప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీనే క‌నిపిస్తుంది.

Ads

chiranjeevi-balayya

అంతే కాకుండా వీరిద్ద‌రి స్నేహం పై ఎన్నిర‌కాల పుకార్లు వ‌చ్చినా కూడా చాలా అవ‌న్ని ఉత్తుత్తి వార్తలే. వీరిద్ద‌రూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఎవ‌రి ఇంట్లో ఫంక్ష‌న్ అయినా మ‌రొక‌రు హాజ‌ర‌వుతారు. చిరంజీవి కూతురు పెళ్లిలో బాల‌య్య ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. బాల‌య్య ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు కూడా చిరు హాజ‌ర‌వుతూ ఉంటారు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక‌రి సినిమా ఫంక్ష‌న్ లో మ‌రొక‌రు క‌నిపించ‌డం మాత్రం ఒకేసారి జ‌రిజ‌రిగింది.

Ads

బాల‌య్య హీరోగా న‌టించిన గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి సినిమా ఫంక్ష‌న్ కు మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చారు. బాల‌య్య చిరుకు ఫోన్ చేసి స్వ‌యంగా ఆయ‌న‌ను ఆహ్వానించారు. దాంతో ఇద్ద‌రూ క‌లిసి ఆ ఫంక్ష‌న్ లో సంద‌డి చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందు బాల‌య్య మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు కూడా చిరు స‌పోర్ట్ చేశార‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Ad

బాల‌య్య న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఆదిత్య 369 కు సైతం చిరంజీవి ప్ర‌మోష‌న్స్ చేశారు. సినిమా విడుద‌ల త‌ర‌వాత ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా నిర్మాత ఓ యాడ్ ను తీయాల‌నుకున్నారు. ఆ యాడ్ కోసం చిరును సంప్ర‌దించ‌గా ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పారు. ఆ యాడ్ దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌సారం కాగా దాని ప్ర‌భావం తో కూడా సినిమాకు మైలేజ్ పెరిగింది. అలా చిరు బాల‌య్య సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేశారు.